Gujarat Election 2022: డిసెంబర్ 12న గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..

నరేంద్ర మోదీ, అమిత్‌ షా త్రయం సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భారీగా సక్సెస్‌ అయ్యారు. గుజరాత్‌లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు సిద్ధమైంది.

Gujarat Election 2022: డిసెంబర్ 12న గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..

Gujarat cm

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాల్లో బీజేపీ విజయదుందుబి మోగిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి బీజేపీ హవా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 2గంటల సమయం వరకు మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 158 స్థానాల్లో ముందంజలో ఉంది. వీటిలో 20 మంది అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గతంలో ఎన్నడూలేని రీతిలో కేవలం 16 స్థానాలకే పరిమితమవుతుంది. 16మందిలో ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించగా, మరో 14 మంది ముందంజలో ఉన్నారు. ఇక, గుజరాత్ లో అధికారం మాదే అని ప్రచారం చేస్తూ వచ్చిన ఆప్ ను గుజరాతీయులు ఆదరించలేదు. ఆప్ అభ్యర్థులు కేవలం ఐదు స్థానాల్లోనే ముందంజలో ఉన్నారు.

Gujarat – Himachal Pradesh Election Counting 2022 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ .. (Live Updates)

నరేంద్ర మోదీ, అమిత్‌ షా త్రయం సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భారీగా సక్సెస్‌ అయ్యారు. గుజరాత్‌లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు సిద్ధమైంది. ఇదిలాఉంటే గుజరాత్‌ చరిత్రలో ఇంత మెజార్టీతో ప్రభుత్వాన్ని మునుపెన్నడూ ఏర్పాటు చేసింది లేదు. 1985లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 149 సీట్లు గెల్చుకుంది. ఆ టైంలో మాధవ్‌ సింగ్‌ సోలంకి నేతృత్వం వహించారు. ఆపై 2002లో 127 సీట్లు సాధించింది ఆ లిస్ట్‌లో వెనుక నిల్చుకుంది బీజేపీ. ఇక ఇప్పుడు ఏకంగా 150 సీట్లకు పైగా ఆధిక్యంలో కమలం దూసుకుపోతుంది.

Himachal Pradesh Election Counting 2022 : హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం లాంఛనం కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. డిసెంబఱ్ 12న మధ్యాహ్నం 2గంటలకు భూపేంద్ర పటేల్ మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు హాజరవుతారని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు.