Gujarat CM Bhupendra Patel : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. రెండోసారి బాధ్యతలు స్వీకరణ!
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్టానం అధిష్టానం ఖరారు చేసింది.

Bhupendra Patel
Gujarat CM Bhupendra Patel : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
కాసేపటి క్రితం గవర్నర్ ను కలిసేందుకు బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా గుజరాత్ గవర్నర్ కు బీజేపీ విజ్ఞప్తి చేయనుంది. బీజేపీఎల్ పీ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్
ముండా హాజరయ్యారు.
Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికలు.. యోగి ఆదిత్యానాథ్‌కు కేజ్రీవాల్ కౌంటర్
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్సాటుకు ముందు భూపేంద్ర పటేల్ తోపాటు మంత్రివర్గం శుక్రవారం అధికారికంగా రాజీనామా చేశారు. డిసెంబర్ 12న గాంధీనగర్ లోని హెలిప్యాడ్ గ్రౌండ్ లో భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఎన్నికల ముందే తమ సీఎం అభ్యర్థిగా పటేల్ ను బీజేపీ ప్రకటించింది.
గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానాలకు గానూ 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవ్వనున్నారు.