Antibodies: కొవిడ్ డోస్ తీసుకున్న 4నెలలకే భారీగా పడిపోతున్న యాంటీబాడీలు

కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. ఇండియా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614మంది హెల్త్ వర్కర్లలో...

10TV Telugu News

Antibodies: కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. ఇండియా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614మంది హెల్త్ వర్కర్లలో తగ్గిపోవడంతో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు అధికారులు. దీనిని బట్టి యాంటీబాడీలు తగ్గిపోతే జబ్బు నుంచి తట్టుకుని ఉండలేమనే అపోహ వద్దు.. బాడీ మొమరీ సెల్స్ గణనీయమైన రక్షణ అందించి కాపాడతాయని స్టడీలో వెల్లడైందని డైరక్టర్ అన్నారు.

‘ఆరు నెలల తర్వాత గానీ బూస్టర్ డోస్ కావాలా వద్దా అని స్పష్టంగా చెప్పలేమని భువనేశ్వర్ లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సంఘమిత్ర పతి అంటున్నారు. పాన్ ఇండియా డేటాను బట్టి.. పలు ప్రాంతాల్లో మరిన్ని స్టడీలు నిర్వహించాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు.

ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఆరు నెలల్లోనే పనితనం కోల్పోతాయని బ్రిటీష్ రీసెర్చర్లు వెల్లడించారు. స్క్వేర్ ప్రింట్ ప్లాట్‌ఫాం రీసెర్చ్ స్టడీలో ఇది పబ్లిష్ అయింది. ఇందులో కొవీషీల్డ్, కొవాగ్జిన్ పై కూడా స్టడీ జరిగింది.

ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో మొత్తం 944 మిలియన్ మందికి పూర్తి డోసులు అందాయి. 60శాతం మంది ఒక డోస్ తీసుకోగా.. 19శాతం మంది రెండు డోసులు తీసుకోవాల్సి ఉంది.

10TV Telugu News