SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయండి

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే..

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయండి

Sbi Alert For Customers

SBI Alert For Customers : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే.. బ్యాంకుకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే డిలీట్ చేయాలని తన కస్టమర్లను ఎస్‌బీఐ హెచ్చరించింది.



దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడినప్పటికీ కొత్త రూపంలో చోటు చేసుకుంటున్న మోసాలు ఖాతాదారులను నిలువునా ముంచేస్తున్నాయి. ప్రజలు తమ మొబైల్‌ నుంచి వేర్వేరు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్న తరుణంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్‌ మోసాలపై హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా, ఎస్బీఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. బ్యాంకింగ్‌ మోసాలు పెరిగిపోతుండటంతో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉంచొద్దని సూచించింది. ముఖ్యంగా పిన్‌, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్‌ సహా కీలక సమాచారాన్ని ఫోన్ లో ఉండకుండా చూసుకోవాలని కోరింది. అవి కనుక ఫోన్ లో ఉంటే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరించింది. అందువల్ల బ్యాంకింగ్‌ సంబంధిత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్‌ నుంచి డిలీట్ చేయాలని ఎస్బీఐ సూచించింది.



దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐలో 45 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి ఎస్బీఐ తన కస్టమర్లను నిరంతరం అలర్ట్ చేస్తూ ఉంటుంది. నిత్యం జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. కాగా, చాలా మంది.. డెబిట్, క్రెడిట్ కార్డుల నెంబర్లు, పాస్ వర్డ్ లు గుర్తు పెట్టుకోవడం కష్టం అని భావించి స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేస్తుంటారు. అవసరం అయినప్పుడు ఫోన్ లో చూసి పని కానిస్తుంటారు. తమ వెసులుబాలు కోసం చాలామంది ఇలా బ్యాంకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని ఫోన్ లో ఫీడ్ చేస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని బ్యాంకులు చెబుతున్నాయి. ఫోన్ లో ఉన్న బ్యాంకు సంబంధ రహస్య సమాచారం క్రిమినల్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని, బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే చాన్సుందని హెచ్చరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు సంబంధ రహస్య సమాచారాన్ని ఫోన్ లో ఫీడ్ చేసుకోకపోవడమే బెటర్.