బడ్జెట్ 2021-22.. సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్

బడ్జెట్ 2021-22.. సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్

big relief for senior citizens in union budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. స్పీకర్‌ ఓం బిర్లా వారించినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా మూడోసారి. కాగా, దేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లెస్(డిజిటల్) బడ్జెట్ ను సమర్పించారు. ట్యాబ్‌లో చూసి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు(75ఏళ్లు పైబడిన వారికి) కేంద్రం ఊరట ఇచ్చింది. 75ఏళ్లు పైబడిన పెన్షనర్లకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట కల్పిస్తామన్నారు. చిన్న ట్యాక్స్ పేయర్ల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ప్యానల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

* 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు(పెన్షనర్లకు) ఊరట.
* ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు.
* రూ.5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే.
* పన్నుల వ్యవస్థ సరళీకరణ.. వివాదాల పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.
* రూ.50లక్షలలోపు ఆదాయం, రూ.10లక్షలలోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీ అప్పీలు చేసుకునే అవకాశం.