Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయమై మంగళవారం విచారణ ముగించిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను స్తంభింపజేసింది. ఇప్పటికి విడుదలైన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

Big Relief For Yogi Adityanath Government On Reservation In Local Polls

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లపై అలహాబాద్ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. దీంతో యోగి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Bengaluru: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుస్తులు తీసేయమన్నారన్న మహిళ.. అధికారులు ఏం చెప్పారంటే

రాష్ట్రంలోని 17 మునిసిపల్ కార్పొరేషన్లు, 200 మునిసిపల్ కౌన్సిల్‌లు మరియు 545 నగర పంచాయితీల ఎన్నికల్లో భాగంగా ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ కొంతమంది అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఓబీసీ రిజర్వేషన్లను నిరోధించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‭ను రద్దు చేయడంతో పాటు, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది.

Bharat Jodo Yatra: రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటానంటున్న బీజేపీ నేత.. కాకపోతే ఒక్క షరతు!

కాగా, అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయమై మంగళవారం విచారణ ముగించిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను స్తంభింపజేసింది. ఇప్పటికి విడుదలైన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే స్థానిక సంస్థల్లో కోటా ఇచ్చేందుకు ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనంపై మార్చి 31లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?

కాగా, ప్రత్యేక ఓబీసీ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని, మార్చి నాటికి పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూత్రాన్ని అనుసరించాలని, రిజర్వేషన్లను నిర్ణయించే ముందు ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు వాదించారు. స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సర్వే చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు.