Meghalaya : కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలు

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్నీ టీఎంసీ నేతలు ధ్రువీకరించారు.

Meghalaya : కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలు

Meghalaya

Meghalaya : మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్నీ టీఎంసీ నేతలు ధ్రువీకరించారు. టీఎంసీలో చేరినవారిలో మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా ఉండటం గమనార్హం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అనూహ్యంగా 12 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడంతో రాత్రికి రాత్రే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయింది. తృణమూల్‌లో చేరడంపై స్పీకర్‌కు లేఖరాసినట్లు తెలిపారు ఎమ్మెల్యేలు

చదవండి : Meghalaya : కాంగ్రెస్‌‌లో సంక్షోభం, ముకుల్, ఇతర ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరే అవకాశం ?

బెంగాల్‌లో మూడోసారి అధికారం చేపట్టిన టీఎంసీ దేశ వ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు టీఎంసీ నేతలు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో టీఎంసీ గోవాలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీకి ఆమె మద్దతు ప్రకటించింది. ఇక ఇదే సమయంలో మేఘాలయపై కూడా దృష్టిపెట్టింది ఆ పార్టీ. వచ్చే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నధం అవుతుంది. 60 అసెంబ్లీ స్థానాలు అమ్మ మేఘాలయాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది.

చదవండి : Meghana Raj Sarja : జూనియర్ చిరు పేరు రివీల్ చేసిన మేఘన..! వీడియో వైరల్