ఎన్నికల వేల నితీష్ తాయిలాలు : ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు.

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2020 / 09:33 PM IST
ఎన్నికల వేల నితీష్ తాయిలాలు : ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు.

మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ ‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ సంస్థలు ఆ శాఖ కిందకు వస్తాయని అన్నారు.


ఇంటర్‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ సంస్థలు ఆ శాఖ కిందకు వస్తాయని అన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించేవారికి ఆర్థిక సహాయం చేస్తామని నితీశ్‌ కుమార్‌ చెప్పారు.


కాగా, బిహార్ ఎన్నికల షెడ్యూలును ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బిహార్​ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు 3 దశల్లో పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 28న తొలి విడత పోలింగ్ జరగనుండగా… నవంబర్ 3న రెండో విడత… నవంబర్- 7మూడో విడత పోలింగ్ జరుగనుంది. అన్ని దశల ఓట్ల లెక్కింపు నవంబర్​ 10న జరగనుంది. బిహార్ ప్రస్తుత ‌ అసెంబ్లీ గడువు నవంబర్-‌ 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు సీఎం నితీష్ కుమార్ తెలిపారు.