కరోనాతో బీహార్ చీఫ్ సెక్రటరీ కన్నుమూత

దేశవ్యాప్తంగా క‌రోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.

కరోనాతో బీహార్ చీఫ్ సెక్రటరీ కన్నుమూత

Bihar

Bihar దేశవ్యాప్తంగా క‌రోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల మంది కరోనా కాటుకి బలైపోతున్నారు. ఇలా క‌రోనా కాటుకు బ‌ల‌వుతున్న వాళ్ల‌లో సామాన్యులే కాదు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా కాటుకి బ‌ల‌య్యారు.

ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డ్డ అరుణ్‌కుమార్ సింగ్ ప‌ట్నాలోని పరాస్ HMRI హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం మ‌ధ్యాహ్నం క‌న్నుమూశారు. కాగా, 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అరుణ్ కుమార్ సింగ్ బీహార్ చీఫ్ సెక్రటరీగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భాద్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు-31న ఆయన రిటైర్ట్ కావాల్సి ఉంది.

అరుణ్ కుమార్ మరణం పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. అరుణ్ సేవలను కొనియాడారు. అధికార లాంఛనాలతో అరుణ్ కుమార్ అంత్యక్రియలు జరగుతాయని నితీష్ కుమార్ తెలిపారు. ఇక,ప్రస్తుతం బీహార్ లో 1లక్షకు పైగా యాక్టివ్ కరోనావైరస్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2480 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.