Presidential Candidate: రాష్ట్రపతి పదవి రేసులో లేనన్న నితీష్ కుమార్

నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.

Presidential Candidate: రాష్ట్రపతి పదవి రేసులో లేనన్న నితీష్ కుమార్

Nitish

Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని.. “అసలు ఈ విషయంపై తనకు అవగాహనే(సమాచారం అని) లేదని” నితీష్ కుమార్ అన్నారు. మంగళవారం భాగల్పూర్ లో నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు. ఫిబ్రవరి 18న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం నితీష్ కుమార్ ఢిల్లీలో రహస్య భేటీలో పాల్గొన్నారు. ఇరువురు దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి విషమై వీరిరువురు భేటీ అయినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తమ భేటీలో రాజకీయ అంశాలు చర్చించలేదంటూ భేటీ అనంతరం ఇరువురు ప్రకటించారు.

Also read: UP Election 2022: నేడే యూపీలో 59స్థానాల్లో పోలింగ్.. లఖింపూర్ ఖేరీ, రాయ్‌బరేలీలో కూడా!

ఇదిలా ఉంటే.. ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి నవాబ్ మాలిక్ మంగళవారం ముంబైలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా నితీష్ పేరును విపక్ష సభ్యులు ఖరారు చేయాల్సి ఉందని అన్నారు. అయితే బీహార్ లో జేడీ(యూ).. బీజేపీతో పొత్తు తెంచుకుంటేనే ఇది సాధ్యపడుతుందని మాలిక్ అన్నారు. దేశంలో ప్రత్యామ్న్యాయ కూటమి ఏర్పాటు పై తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అనంతరం.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంపై ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం నితీష్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. ఆమేరకు రాష్ట్రపతి అభ్యర్థి విషయమై.. మహా నేతలతోనూ..పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ, తమిళనాడు సీఎం స్టాలిన్ తోనూ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

Also read: IAS Officers : ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు

ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతంలో ప్రశాంత్ కిషోర్ వారితో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా నితీష్ పేరు వినిపించడంపై బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత తార్కిషోర్ ప్రసాద్ స్పందిస్తూ.. “ప్రస్తుతం రాష్ట్రపతి స్థానంలో రామ్ నాథ్ కోవిద్ ఉన్నందున..అక్కడ ఖాళీ లేదని” అన్నారు.

Also read: New Districts: జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు.. అభ్యంతరాలు, సూచనలపై సమీక్షలు