Hijab Row: ‘ఇదంతా పనికిరాని వ్యవహారం’..హిజాబ్ వివాదంపై బీహార్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక హిజాబ్ వివాదం రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Hijab Row: ‘ఇదంతా పనికిరాని వ్యవహారం’..హిజాబ్ వివాదంపై బీహార్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Hijab Row

Hijab Row..Bihar CM Interesting Comments : కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ దుమారంపై రాజకీయ దుమారంగా మారింది. నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.ఈక్రమంలో ‘హిజాబ్’ వ్యవహారంపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీహార్ రాజధాని పాట్నాలో జ‌రిగిన ప్రజా దర్బార్ సందర్భంగా మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ..బీహార్ స్కూల్స్ లో పిల్లలు అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారని..ఒకరి మతపరమైన సెంటిమెంట్లను మరొకరు గౌరవిస్తారని..వారి వారి మతం లేదా సంస్కృతిని ఆచరించే విధానంలో తాము జోక్యం చేసుకోం అని స్పష్టంచేశారు.

Also read : Hizab Row : హిజాబ్‌ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ : అసదుద్దీన్ ఒవైసీ

ఇటువంటి విషయాలను వివాదాలుగా మార్చవద్దని..ఇటవంటివాటిపై శ్రద్ధ పెట్టకూడదని సీఎం నితీశ్ కుమార్ సూచించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని మా రాష్ట్రం లో గౌరవిస్తామని..క్లాసు రూముల్లో విద్యార్థినులు హిజాబ్ ధరిస్తే దానిపై అసలు కామెంట్ చేయటం వివాదంగా మార్చటం చేయటం అవసరమే లేదని సీఎం స్పష్టంచేశారు. తాము ఇలాంటివి పట్టించుకోబోము అని..ఇదంతా పనికిరాని వ్యవహారమని అన్నారు.

Also read : Hizab Row : హిజాబ్ తో లోపలికి రావద్దని స్కూల్ బయటే నిలిపివేసిన టీచర్..తీసివేసి క్లాసులకు వెళ్లిన విద్యార్ధినిలు

కర్ణాటక హిజ‌బ్ వివాదం జాతీయ స్థాయిలోనేకాదు అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు దారితీసిన నేప‌థ్యంలో భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో రెచ్చ‌గొట్టే విధంగా మాట్లాడ‌టం ఏమాత్రం స‌రికాద‌ని విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి అరిందం బాగ్చీ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఈ అంశాన్ని క‌ర్నాట‌క హైకోర్టు ప‌రిశీలిస్తోంద‌ని, మా రాజ్యాంగ విధివిధానాలు, ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల ద్వారా ఈ విష‌యాన్ని ప‌రిష్క‌రించుకుంటామ‌ని బాగ్చీ పేర్కొన్నారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

బిహార్ స్కూళ్లలో పిల్లలంతా దాదాపు ఒకేరకమైన దుస్తుల్ని ధరిస్తారు. ఎవరైనా తలపై ఏదైనా పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని సీఎం స్ప‌ష్టం చేశారు. అలాంటి వ్య వహారాల్లో మేం జోక్యం చేసుకోం అని సుస్పష్టంగా వెల్లడించారు. ఎవరి మతాల ఆచారాలను బట్టి వారు ఉంటారని..అందరి మతపరమైన సెంటిమెంట్లను తాము గౌరవిస్తామని..ప్రభుత్వానికి అందరూ సమానమే అని అన్నారు.