Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
మూడు ఎకరాల భూమి కేసుకు సంబంధించి కోర్టు 108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఈకేసులో దావా వేసిన వ్యక్తి మునిమనుమడుకు ఈ ఆస్తి సంక్రమించింది.

Court verdict delivered after 108 years in a civil case : కోర్టుల్లో సివిల్ మ్యాటర్ల కేసులు దశాబ్దాల తరబడి కొనసాగుతుంటాయని తెలిసిందే. కానీ మరో శతాబ్దం అంటే 100 ఏళ్ల దాటి మరీ కొనసాగుతాయా? అంటే నిజమే అని అనాల్సిందే. ఎందుకంటే ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు తీర్పును కోర్టు 108 ఏళ్లకు తీర్పునిచ్చింది…! ఇది బహుశా దేశంలో పెండింగ్‌లో ఉన్న అత్యంత పురాతన కేసులలో ఒకటి అని చెప్పవచ్చు. 108 ఏళ్లకు ఎట్టకేలకు కోర్టు మార్చి 11న భోజ్ పూర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతా సింగ్ తీర్పును వెలువరించారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని భోజ్ పుర్ జిల్లా ఆరా సివిల్ కోర్టులో 1914లో మూడు ఎకరాలకు సంబంధించి భూ వివాదానికి సంబంధించి దావా దాఖలయింది. కోయల్వార్ గ్రామంలో మూడు ఎకరాల భూమికి సంబంధించిన దావా ఇది. యాజమాన్య హక్కుల కోసం రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఈ దావా వేశారు.
బీహార్ రాజధాని పాట్నాకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి 5 కోట్లు పలుకుతోంది. అప్పట్లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలో కొయిల్వార్ లో అజ్ హర్ ఖాన్ అనే వ్యక్తికి 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి కొనుగోలు చేసిన మూడు ఎకరాల స్థలం విషయమై రెండు రాజ్ పుత్ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఒక వర్గం కోర్టులో దావా వేసింది. రాజీ కుదుర్చుకునేందుకు రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో, కేసు విచారణ శతాబ్ద కాలానికి పైగా కొనసాగింది. ఎట్టకేలకు మార్చి 11న భోజ్ పుర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతాసింగ్ తీర్పును వెలువరించారు. కేసు వేసిన దర్బారీసింగ్ ముని మనవడు అతుల్ సింగ్ తదితరులకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు.
ఈ కేసుకు సంబంధించి తీర్పునిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి శ్వేతాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1914 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు విచారణ కొనసాగిందని… ఇదే సమయంలో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా.. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందని చెప్పలేమని అన్నారు. కేసు ఓడిపోయిన వారు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
- RJD MLA: బిహార్ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష
- Agnipath Protests: అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
- Bananas : అరటిపండ్లు తిన్న 120 మందికి అస్వస్థత..ఐదుగురి పరిస్థితి విషమం..
- china: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయుల అరెస్టు
- Katihar Fat Man: రోజూ ఇలాగే.. 15మంది తిండిని ఒక్కడే లాగించేసే వ్యక్తి
1GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800కోట్ల డబ్బు మాయం
2Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
3Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
4Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
6Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
7Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
8prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
9Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
10ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్