నిజాలు దేవుడికెరుక! సుషాంత్ అకౌంట్లో రూ.50కోట్లు మాయం

నిజాలు దేవుడికెరుక! సుషాంత్ అకౌంట్లో రూ.50కోట్లు మాయం

బీహార్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే ముంబై పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో ఆర్థికపరంగా ముంబై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా అతని అకౌంట్లలో నుంచి రూ.50కోట్లు మాయం కావడంపై ఎవరూ పట్టించుకోవడం లేదు. గతేడాది ఒక్కటే రూ.15కోట్లు మాయం అయ్యాయి.

‘నాలుగేళ్లుగా అతని అకౌంట్లోకి రూ.50కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఆశ్చర్యంగా అవి కనిపించకుండానే పోయాయి. ఒక్క సంవత్సరంలోనే రూ.17కోట్లు డిపాజిట్ అయ్యాయట. అందులో నుంచి రూ.15కోట్లు విత్ డ్రా చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఇది కీలకమైన విషయం కాదా..? మేం సైలెంట్ గా ఉండం. ముంబై పోలీసులను మేం తప్పక ప్రశ్నిస్తాం. అలాంటి లీడ్ లు అన్నింటినీ ఎందుకు అలా వదిలేస్తారు’ అని డీజీపీ గుప్తేశ్వర్ పాండే అంటున్నారు.

అంతకంటే ముందు వినయ్ తివారీ పాట్నా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) బీహార్ నుంచి ఇన్వెస్టిగేషన్ కోసం పంపించారు. బలవంతంగా క్వారంటైన్ కు పంపించారు. ‘సుషాంత్ డెడ్‌బాడీ పోస్టుమార్టం, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు ముంబై పోలీసులు మా ఎస్పీని అరెస్టు చేశారు. ఇతర రాష్ట్ర పోలీసులకు నాన్ కోఆపరేషన్ చూపించడం నేను ఇప్పటివరకూ చూడలేదు. ఒకవేళ ముంబై పోలీసులు సిన్సియర్ అయితే వారి ఇన్వెస్టిగేషన్ వివరాలను మాతో పంచుకోవాలి’ అని ఆయన అన్నారు.

సోమవారం ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ మీడియా కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. సుషాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అవలేదు. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అకౌంట్ కు వెళ్లాయి. పోలీసులు ఇింకా ఫైనాన్షియల్ యాంగిల్ లో దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై కమిషనర్ అన్నారు.