మొదట ఆర్జేడీ తర్వాత జేడీయూ :12 ఓట్ల తేడాతో గెలిచిన JDU అభ్యర్థి

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 10:35 AM IST
మొదట ఆర్జేడీ తర్వాత జేడీయూ :12 ఓట్ల తేడాతో గెలిచిన JDU అభ్యర్థి

Nitish Kumar’s Party Wins Hilsa Seat By Just 12 Votes బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మిలోని బీజేపీ 74 స్థానాలు సాధించ‌గా, జేడీయూ 43 స్థానాల్లో విజ‌యం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విష‌యం తెలిసింది. అయితే హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూ పార్టీ కేవ‌లం 12 ఓట్ల తేడాతో గ‌ట్టెక్కింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూకు ఆర్జేడీ గ‌ట్టి పోటీనిచ్చింది. హిల్సా నుంచి పోటీ చేసిన జేడీయూ అభ్య‌ర్థికి 61,848 ఓట్లు పోల‌వ్వ‌గా, ఆర్జేడీ అభ్య‌ర్థికి 61,836 ఓట్లు వ‌చ్చాయి.



అయితే మొద‌ట్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తి సింగ్ యాద‌వ్ 547 ఓట్ల మెజార్టీతో గెలిచిన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు. కానీ కొద్దిసేపటికే ఆర్జేడీ అభ్య‌ర్థి 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ట్లు,జేడీయూ అభ్యర్థి గెలిచినట్లు రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు. చీఫ్ మినిస్ట‌ర్ ఇంటి నుంచి రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌కు కాల్ రావ‌డంతో.. ఆర్జేడీ అభ్య‌ర్థి 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ట్లు ప్రకటించారని ఆర్జేడీ ఆరోపించింది.



https://10tv.in/nda-wins-in-bihar-assembly-election/
పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్లే ఆర్జేడీ అభ్య‌ర్థి ఓడిపోయిన‌ట్లు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ప్ర‌క‌టించార‌ని ఆ పార్టీ ట్విట్టర్ లో ఆరోపించింది. ఈ ట్వీట్‌పై ఎన్నిక‌ల అధికారులు స్పందిస్తూ త‌మ‌పై ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారి శ‌ర‌ణ్‌కు 232 పోస్ట‌ల్ బ్యాలెట్లు, శ‌క్తిసింగ్ యాద‌వ్‌కు 233 ఓట్లు పోలైన‌ట్లు తెలిపారు.