Bihar : ఏక్ దిన్ కా కరోడ్ పతి..అకౌంట్లో రూ. 52 కోట్లు, కొంత ఇవ్వాలంటున్నాడు

న్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్‌.

Bihar : ఏక్ దిన్ కా కరోడ్ పతి..అకౌంట్లో రూ. 52 కోట్లు, కొంత ఇవ్వాలంటున్నాడు

Bihar

Rs 52 Crore In Pension Account : నిన్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్‌. దేశంలో ఏ రాష్ట్రంలో కాదుగానీ… బీహార్‌లో మాత్రం  సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. సాధారణ పౌరుల బ్యాంకు ఖాతాల్లో కోట్లలో డబ్బు వెల్లువలా వచ్చి పడుతోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు.  పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి చేరుతున్నారు.

Read More : Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

కడుపేదలు కోట్లాధిపతులు అవుతున్నారు. విషయం నలుగురికీ తెలియడంతో మళ్లీ వచ్చిపడిన అకౌంట్‌ను రిటర్న్‌ చేస్తున్నారు బ్యాంక్‌ అధికారులు. దీంతో  ఏక్‌ దిన్‌కా కరోడ్‌పతిగా మిగులుతున్నారు.అసలు మ్యాటరేంటంటే… ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌షా బ్యాంక్‌ అకౌంట్‌లో కోట్ల డబ్బు వచ్చి పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 52 కోట్ల మనీ అతడి అకౌంట్‌లో జమ అయ్యింది. బహుదూర్‌షా పింఛన్‌ కోసం ఖాతాకు ఆధార్‌కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు.

Read More : Ola Bike Sales: సరికొత్త రికార్డు.. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన బైక్‌ల అమ్మకాలు

ఖాతాలో నగదు ఎంతుందో చెక్‌ చేయాలని అక్కడి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ అధికారిని కోరగా.. అందులో 52 కోట్లు ఉన్నట్టు చూపించింది. అంతమొత్తంలో డబ్బు ఉండడం చూసి బహుదూర్‌ షా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అసలు అది తన ఖాతానేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన ఖాతానేనని.. 52కోట్ల మనీ ఉందని చెప్పడంతో నమ్మలేకపోయాడు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తనకు తెలియదన్నాడు. దీంతో బ్యాంక్‌ అధికారులు ఏ ఖాతా నుంచి అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందో వివరాలు తీశారు. అనంతరం అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని చెప్పుకొచ్చాడు రామ్‌ బహుదూర్‌ షా. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నానని…  ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు.