Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

రోజు కూలీగా పని చేస్తూ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఒక వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.14 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు షాకయ్యాడు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

Bihar: బిహార్‌లో ఒక దినసరి కూలీకి షాకిచ్చారు ఐటీ అధికారులు. రూ.14 కోట్ల పన్నులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కూలీ, అతడి కుటుంబం షాక్‌కు గురైంది. బిహార్, ఖర్గహార్ గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.

Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నిందితుడిని పెళ్లి చేసుకున్న యువతి

గతంలో అతడు హరియాణా, పంజాబ్, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల్లో లేబర్‌గా పని చేసేవాడు. కాగా, గత శనివారం అతడి ఇంటికి వచ్చిన ఐటీ అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. రూ.14 కోట్లు పన్ను రూపంలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మనోజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, వాటికి పన్ను చెల్లించాల్సి ఉందని, అందువల్లే నోటీసులు ఇచ్చినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఆ నోటీసులు అందుకున్న మనోజ్, అతడి కుటుంబం షాక్‌కు గురైంది. తాను దినసరి కూలీగా పని చేస్తుంటానని, ఆ లావాదేవీలతో సంబంధం లేదన్నాడు. తన ఆస్తి మొత్తాన్ని చాలా సార్లు అమ్మినా, అంత డబ్బు చెల్లించలేనని పేర్కొన్నాడు. తన ఆధార్ కార్డు, పాన్ కార్డును వాడి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఉంటారని, పన్నులు ఎగ్గొట్టేందుకు వీటిని వాడుతున్నారని మనోజ్ యాదవ్ ఆరోపించాడు.

CM Jagan’s Birthday : రేపు సీఎం జగన్ బర్త్ డే.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు

కాగా, యాదవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ఐటీ అధికారులు అతడి ఇంటిని, ఆర్థిక పరిస్థితిని చూసి షాకయ్యారు. అతడి కుటుంబం ఉన్న స్థితికి, ఆదాయ పన్నుకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉందని అధికారులు భావించారు. అయితే, అతడికి నోటీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిందని, అందుకే తాము నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు.