Bihar : బీహార్‌లో పిడుగుపాటుకు మరో 16 మంది దుర్మరణం

బీహార్‌లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు మొత్తం 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు.

Bihar : బీహార్‌లో పిడుగుపాటుకు మరో 16 మంది దుర్మరణం

16 Killed In Lightning Strikes.. Thunderstorm In Bihar

16 killed in lightning strikes.. thunderstorm in Bihar : బీహార్‌లోని పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిసాయి. మంగళవారం (జూన్ 28,2022) పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 16 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జూన్ నెలలోనే పిడుగుపాటు వల్ల మొత్తం 36 మంది మృతిచెందారని వెల్లడించారు.

మంగళవారం మరణించినవారిలో ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాల్లో నలుగురు, భోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్‌ జిల్లాలో ముగ్గురు, వెస్ట్‌ చంపారన్‌ జిల్లాలో ఇద్దరు, అరారియా జిల్లాలో ఇద్దరు, బంకా, ముజఫర్‌పూర్‌ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం నితీష్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.

కాగా జూన్ 18,19 తేదీల్లో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా బీహార్ లో పిడుగు పాటుకి ఒక్క జూన్ నెలలోనే 36మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే జూన్ 21న పూర్నియా, ఖాగారియా, సహార్సాల్లో పిడుగు పడి ముగ్గురు చనిపోయారు. అలా ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు 36మంది ప్రాణాలుకోల్పోయారు.