శవాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..అంత్యక్రియలకు అతని అకౌంటులో డబ్బులివ్వాలంటూ రచ్చ

శవాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..అంత్యక్రియలకు అతని అకౌంటులో డబ్బులివ్వాలంటూ రచ్చ

Bihar corpse came bank for money in account : బీహార్ రాజధాని పాట్నాలో ఎవ్వరూ ఊహించలేని ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పరిధిలోగల ఒక గ్రామంలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఓ శవం బ్యాంకుకు వచ్చింది. తన అంత్యక్రియలు చేసుకోవటానికి తన అకౌంటులో ఉన్న డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసిన ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. అదేంటీ శవం ఏంటీ బ్యాంకుకు రావటమేంటీ? డబ్బులడగటం ఏంటీ ఇదేదో మరీ విడ్డూరంగా ఉందే అనుకోవచ్చు..

కానీ అసలు సంగతేంటంటే..సిటీ సబ్ డివిజన్‌లోని షాజహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిగ్రియావాన్ గ్రామానికి చెందిన మహేష్ యాదవ్(55) అనారోగ్యంతో మృతి చెందాడు. అతని అంత్యక్రియలు చేయాలంటే డబ్బులు కావాలి కదా..అందుకోసం మహేష్ యాదవ్ కు కెనరా బ్యాంకులో అకౌంట్ ఉంది కదా..ఆ డబ్బులతో అంత్యక్రియలు చేద్దామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామస్తులు ఏకంగా మహేష్ యాదవ్ మృతదేహాన్ని తీసుకుని కెనరా బ్యాంకుకు వెళ్లారు. శవాన్ని మోసుకుంటూ వచ్చివారిని చూసి బ్యాంకు సిబ్బంది అవాక్కయ్యారు.

అలా మృతుడితో పాటు వచ్చిన గ్రామస్తులు మహేష్ యాదవ్ చనిపోయాడు. అతన్ని అంత్యక్రియలు చేయాలి అతని ఖాతాలోని డబ్బులు ఇవ్వాలని అడిగారు. దానికి బ్యాంకు మేనేజర్ నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహేష్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకు కార్యాలయంలోకి తీసుకువచ్చారు.

అలా మూడు గంటలపాటు మహేష్ మృతదేహం బ్యాంకులోనే ఉంచారు. డబ్బులు ఇచ్చేదాకా శవాన్ని ఇక్కడే ఉంచుతామని తెగేసి చెప్పారు. బ్యాంకు మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు అతని వినిలేదు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన సొంత డబ్బుని రూ. 10 వేలు తీసి..వారికిచ్చారు. దీంతో ఆ డబ్బు పట్టుకుని గ్రామస్తులు మహేష్ యాదవ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా మహేష్‌కు వివాహం కాలేదు. పైగా అతనికి బంధువులెవరూ లేరు. అతని బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకుపైగా మొత్తం ఉంది. అయితే అతని బ్యాంకు ఖాతాకు నామినీ ఎవరూ లేరు. ఈ కారణంగానే బ్యాంకు మేనేజర్ అతని సొమ్ము ఇవ్వడానికి నిరాకరించారు. ఇలా ఏది ఏమైతేనే చనిపోయిన మహేష్ యాదవ్ డబ్బుతోనే గ్రామస్తులు అతని కార్యక్రమాలన్నీ చేశారు. అదండీ శవం బ్యాంకుకు వచ్చి డబ్బులడిగిన రియల్ స్టోరీ..