Bihar Assembly : నా కారునే ఆపేస్తారా? పోలీసులపై మంత్రి ఆగ్రహం.. వీడియో

బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న కాన్వాయ్‌ని నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Bihar Assembly : నా కారునే ఆపేస్తారా? పోలీసులపై మంత్రి ఆగ్రహం.. వీడియో

Bihar Assembly

Bihar Assembly : బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న కాన్వాయ్‌ని నిలిపివేయడంతో.. త‌న కారు దిగి వ‌చ్చిన మంత్రి జీవేశ్‌..పోలీసులతో వాగ్వాదానికి దిగారు. త‌న కారును నిలిపేస్తారా అంటూ అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల్ని నిల‌దీశారు. ఎస్పీ, డీఎం వాహ‌నాల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చేందుకు తన వాహ‌నాన్ని నిలిపేశార‌ని మంత్రి జీవేశ్ ఆరోపించారు.

చదవండి : Bihar : ఆర్జేడీ కార్యాలయంలో 6 టన్నుల లాంతర్‌..లాలూ చేతుల మీదుగా ఆవిష్కరణ?..

మంత్రి ప్రోటోకాల్‌కి తుంగలోతొక్కి బ్యూరో కార్ట్స్‌కి క్లియరెన్స్ ఇచ్చారని మండిపడ్డారు. ఇక అధికారుల తీరుపై ప్రతిపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మాట్లాడుతూ.. ‘మంత్రి కారును ఆపిన కానిస్టేబుల్ కాస్త మెంటల్‌గా ఉన్నాడని, దీనిపై చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

చదవండి : Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాట్లాడుతూ.. బీహార్‌లో అధికార యంత్రాంగం తీరు పరాకాష్టకు చేరిందని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు ఫోన్ చేశామని, ఎవరు ఫోన్‌లు ఎత్తడం లేదని, దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చదవండి : Bihar Crime : గుక్కెడు నీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి..దెబ్బలు తాళలేక మృతి

మరోవైపు తనను అడ్డుకున్న పోలీసులను విధుల నుంచి తొలగించే వరకు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని మంత్రి శపథం చేశారు. సీఎం, హోంమంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.