పారిపోయి పెళ్లి చేసుకున్న 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక..వీళ్లకు 8 నెలలు పిల్లాడు : చారిత్రాత్మక తీర్పునిచ్చిన కోర్టు

పారిపోయి పెళ్లి చేసుకున్న 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక..వీళ్లకు 8 నెలలు పిల్లాడు : చారిత్రాత్మక తీర్పునిచ్చిన కోర్టు

14 Year Boy, 16 Year Old Girl Marriage

14 year boy, 16 year old girl Marriage : 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మైనర్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం సంచనల తీర్పునిచ్చింది. బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పెళ్లి విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించింది. వారి వివాహం చెల్లుతుందంటూ తీర్పునివ్వటం గమనించాల్సిన విషయం..

నలందా జిల్లా కోర్టు (బీహార్ షరీఫ్)కు గత శనివారం (2021 మార్చి 20) ఒక విచిత్రమైన కేసు వచ్చింది. 14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి ఇళ్ల నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇంత చిన్నవయస్సులోనే వీరికి ఓ బిడ్డ పుట్టటం..ఆ బిడ్డకు 8 నెలల వయస్సు కూడా ఉండటం మరో ట్విస్టు. ఈ విచిత్రమైన పెళ్లి విషయంపై కోర్టు మానవతా దృక్ఫథంతో వ్యవహరించింది. జస్టిస్ మన్వేంద్ర మిశ్రా సంచనల తీర్పునిచ్చారు.

కోర్టు తన తీర్పులో ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉంచాలని..ప్రతీ ఆరు నెలలకు ఈ జంటకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని పోలీసులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వింత కేసులో ఇటువంటి సంచలనాత్మక తీర్పునిచ్చిన ధర్మాసం..ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఏ రాష్ట్రంలోని కోర్టు అయినా దీనిని అవలంబించకూడదని స్సష్టం చేసింది. ముగ్గురు జీవితాలకు సంబంధించిన ఈ తీర్పు మానవతా దృక్ఫథంతో తీసుకున్నామనీ వివరించింది.

ఈ వింత కేసు వివరాల్లోకి వెళితే సరస్వతి పూజకు హాజరైన బాలిక తన ప్రియునితో పాటు వెళ్లిపోయింది. ఈ క్రమంలో 2019, ఫిబ్రవరి 11న ఆ బాలిక తండ్రి అదే గ్రామానికి చెందిన ఒక బాలునిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనరు జంట తమను విడదీస్తారేమోనని భయపడ్డారు. దీంతో ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఉండే బాలిక అత్త ఇంట్లో ఉన్నారు. అలా కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయ్యింది. నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత కొన్ని రోజులకు తిరిగి ఆమె పుట్టింటికి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో కోర్టు మానవతా దృక్ఫథంతో కూడిన తీర్పునిచ్చింది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి తీర్పునివ్వాల్సి వచ్చిందనీ..మైనరు జంట జీవితాలతో పాటు వారికి పుట్టిన పసిబిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి తీర్పునిచ్చామని..ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఏ రాష్ట్రంలోని కోర్టు అయినా దీనిని అవలంబించకూడదని స్పష్టం చేసింది. ఈ కేసును కేవలం మూడు రోజుల్లో తీర్పునివ్వటం గమనించాల్సిన విషయం.