Bedroom : నవ వధువు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి వాటికోసం వెతికిన పోలీసులు

బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పోలీసులు నవవధువు బెడ్ రూమ్ లో తనిఖీలు చేశారు. పోలీసుల తీరు ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది

Bedroom : నవ వధువు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి వాటికోసం వెతికిన పోలీసులు

Bedroom

Bedroom : బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమానం ఉన్న ఇళ్లకు వెళ్లి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే తాజాగా పోలీసులు ఓ నవ వధువు బెడ్ రూమ్ లో మద్యం సీసాల కోసం తనిఖీ చేయడం వివాదాలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని హాజీపూర్ నగరంలోని హత్సార్ గంజ్ ప్రాంతంలో నివశించే షీలాదేవి కొడుకుకు ఇటీవలే పూజ కుమారితో వివాహం జరిగింది.

చదవండి : Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

ఐదు రోజుల క్రితం ఆమె అత్తారింటికి వచ్చింది. పూజ అత్తారింటికి వచ్చిన మూడవరోజు ఆమె కోసం పోలీసులు ఇంటికి వచ్చారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లంతా తనిఖీ చేశారు. పోలీసులను చూసి భయపడిపోయిన పూజా అత్త షీలాదేవి కళ్ళుతిరిగి పడిపోయింది. అయినా పట్టించుకోకుండా తనిఖీ కొనసాగించారు పోలీసులు. అయితే చివరికి ఇంట్లో ఏమి దొరక్కపోవడంతో వెళ్లిపోయారు.

చదవండి : Police Lathi Charge : నిరుద్యోగులపై లాఠీ జులిపించిన పోలీసులు

ఇక ఈ విషయంపై పూజా మాట్లాడుతూ పోలీసులు ఎంతో దారుణంగా ప్రవర్తించారు. మా ఇంట్లో ఏ ఒక్కరికి మద్యం అలవాటు లేదు.. ఎవరో కావాలని చెప్పినట్లు నా బెడ్‌రూమ్‌లో వెతికారు.. ఈ ఘటన వలన మా ఇంటి పరువు పోయింది.. దీనికి ఎవరు సమాధానం చెప్తారు” అని వాపోయింది. ఇక ఈ విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. సెర్చ్ ఆపరేషన్ నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు చేశారన్న ప్రశ్నకు పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇక ఇలానే గతంలో కూడా తనిఖీలు చేశారు. బెడ్‌రూమ్‌లో పోలీసులు మద్యం కోసం వెతకడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిస్తుంది.

చదవండి : Bihar Assembly : నా కారునే ఆపేస్తారా? పోలీసులపై మంత్రి ఆగ్రహం.. వీడియో