Tokay Gecko Lizard : ఇది నిజ్జం.. ఈ బల్లి ధర అక్షరాల కోటి రూపాయలు

బల్లి ఏంటి, కోటి రూపాయల ధర పలకడం ఏంటి? అని షాక్ అయ్యారు కదూ. అసలు, బల్లి అంటేనే అరిష్టం అంటారు. దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కోటి రూపాయల ధర పలకడం అంటే కామెడీగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం.

Tokay Gecko Lizard : ఇది నిజ్జం.. ఈ బల్లి ధర అక్షరాల కోటి రూపాయలు

Tokay Gecko Lizard : బల్లి ఏంటి, కోటి రూపాయల ధర పలకడం ఏంటి? అని షాక్ అయ్యారు కదూ. అసలు, బల్లి అంటేనే అరిష్టం అంటారు. దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కోటి రూపాయల ధర పలకడం అంటే కామెడీగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం. ఈ బల్లి మామూలు బల్లి కాదు. అరుదైన బల్లి. సాధారణంగా బల్లి అంటే అరిష్టం అంటారు. కానీ, ఈ బల్లి అరిష్టం కాదు అదృష్టం. ఎందుకంటే అది చాలా విలువైనది మరి.

వివరాల్లోకి వెళితే.. ఇది టోకే గెక్కో రకం బల్లి. చూడ్డానికి ప్లాస్టిక్‌ బల్లి లాగా ఉంటుంది. అంతరిస్తున్న జీవ జాతుల జాబితాలో ఉందీ బల్లి. ఇక, అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ‌ అక్షరాల కోటి రూపాయలు అంటే అతిశయోక్తి కాదు.(Tokay Gecko Lizard)

Also Read.. Japanese Beef Croquettes : ఆర్డర్ చేసిన 30 ఏళ్లకు చేతికందే ‘అరుదైన వంటకం’..దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీకావు..

బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో ఈ అరుదైన టోకే గెక్కో బల్లిని, మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతరించిపోయిన తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్‌ నుంచి టోకే గెక్కో బల్లిని బీహార్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ బల్లిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్‌ వంటి ఇతరాత్ర మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల్లో తక్షకు మంచి డిమాండ్ ఉందని, పలు దేశాల్లో దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారని వివరించారు.

Also Read.. Pheasant Pigeon: 140 సంవత్సరాల తర్వాత కనిపించిన అరుదైన పక్షి.. వీడియో ఇదిగో

బల్లి స్మగ్లింగ్ గురించి.. పక్కా సమాచారం అందడంతో పోలీసులు బైసి ప్రాంతంలోని మెడికల్ స్టోర్ లో తనిఖీలు చేశారు. ఈ అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు.