Dream11 : రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ ఓనర్

ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది.

Dream11 :  రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ ఓనర్

Dream11

Dream11 :  ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది. వివరాల్లోకి వెళితే.. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ కు ఓ సెలూన్ ఉంది. ఆ దుకాణమే అతడికి జీవనాధారం. క్రికెట్ పై ఆసక్తి తో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు.

Read More : SBI Card : క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్.. 3 రోజులే..

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పైనా బెట్టింగ్ పెట్టాడు. ఈ మ్యాచ్ లో ఊహించని విధంగా కోటి రూపాయలు దక్కించుకున్నాడు. గతంలో అనేక సార్లు పెట్టింగులు పెట్టినా ఎప్పుడు గెలవలేదని.. ఈ సారి పంట పండిందని అంటున్నాడు అశోక్. రూ.కోటి తో అప్పులు తీర్చి.. ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. కాగా ఈ నగదు రెండు, మూడు రోజుల్లో అశోక్ బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది.

Read More : Aquila Restaurant : చీర కట్టుకురావద్దన్న రెస్టారెంట్ మూతపడనుంది