రెండు అంతస్తుల భవనంపైకెక్కిన స్కార్పియో కారు..సెల్యూట్ అన్న ఆనంద్ మహేంద్రా

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 12:55 PM IST
రెండు అంతస్తుల భవనంపైకెక్కిన స్కార్పియో కారు..సెల్యూట్ అన్న ఆనంద్ మహేంద్రా

Bihar : scorpio car on a house : బీహార్ లోని భాగల్ పూర్ కు చెందిన ఇంతెజార్ ఆలం అనే వ్యక్తి తన రెండు అంతస్తుల బిల్డింగ్ పై కారును పెట్టుకున్నారు. అదేంటీ వాళ్ల ఇంటి కారు పార్కింగ్ చేసుకోవటానికి భవనంపై ఏర్పాటు చేసుకున్నారా? అనే డౌట్ వస్తుంది. అదేం కాదులెండీ..కారు ఆకారాన్ని పోలిన వాటర్ ట్యాంకును వారి రెండు అంతస్తుల బిల్డింగ్ పై నిర్మించుకున్నారు. అది చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు.


ఆనంద్ మహేంద్రా స్పందించడానికి అసలు కారణం ఆ వాటర్ ట్యాంకు మహీంద్రా ‘స్కార్పియో కారు’ను మోడల్ ఉండటమే. ఆ ఇంటి యజమాని ఇంతెజార్ ఆలం ఆ కారు ఆకారంలోని వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టి మరీ ఆ మోడల్ నిర్మించుకున్నాడు.


ఆగ్రాకు చెందిన నిర్మాణ నిపుణులను రప్పించి మరీ అచ్చం స్కార్పియో కారును పోలిన వాటర్ ట్యాంకు నిర్మించుకున్నాడు. తన ఇంటి ఫొటోను ఆలం సోషల్ మీడియాలో పోస్టు చేయగా..అది ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది.




ఆ పోస్టుకు ఆనంద్ మహేంద్ర సంతోషం వ్యక్తంచేస్తూ..”నేను ఇప్పుడు ఏదైనా ఎదుగుదలకు చెందిన విషయం చెప్పాల్సి వస్తే…. స్కార్పియో కారు ఇంటి పైకప్పు మీదకు కూడా చేరిందని చెప్పాలని అన్నారు. ఏదేమైనా ఆ ఇంటి యజమానికి సలాం చేస్తున్నాను. తన మొట్టమొదటి కారుపై అతను చూపిన మమకారం పట్ల సెల్యూట్ ” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


ఓవైపు వ్యాపార లావాదేవీలతో ఎంతో బిజీగా ఉండే బిజినెస్ మాగ్నెట్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు కూడా తగిన సమయం కేటాయిస్తుంటారు. తన దృష్టికి వచ్చే అంశాలను అందరితో పంచుకునేందుకు ఆయన ఆసక్తి చూపిస్తుంటారనే విషయం తెలిసిందే. ఆయన షేర్ చేసిన ఎన్నో పోస్టులు వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. కాగా స్కార్పియో వాహనం మహేంద్రా కంపెనీదనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.