ఇతని తల్లి సన్నీలియోన్..నాన్న ఇమ్రాన్ హష్మీ అట..!! హాల్‌టికెట్ షాకింగ్ విషయాలు

  • Published By: nagamani ,Published On : December 10, 2020 / 03:41 PM IST
ఇతని తల్లి సన్నీలియోన్..నాన్న ఇమ్రాన్ హష్మీ అట..!! హాల్‌టికెట్ షాకింగ్ విషయాలు

Bihar student names Emraan Hashmi, Sunny Leone as parents : బాలీవుడ్ నటి సన్నీలియోన్,నటుడు ఇమ్రాన్ హష్మీలు తన తల్లిదండ్రులని ఓ విద్యార్థి అంటున్నాడు. ఏంటీ వింటుంటేనే షాకింగ్ గా ఉంది కదూ. నిజమేమరి..సన్నీలియోన్.. ఇమ్రాన్ హష్మీలు భార్యాభర్తలు ఎప్పుడయ్యారు? వీళ్లిద్దరూ ఆ స్టూడెంట్ కు తల్లిదండ్రులేంటీ? విడ్డూరం కాకపోతే..అనటానికైనా ఓ పద్ధతీ పాడూ లేదా? అని అనిపిస్తోంది కదూ. కానీ ఇది జోక్ కాదు ఓ కాలేజీ విద్యార్ధి హాల్ టికెట్ లో ఉన్న వివరాలివి. వాటిని చూసి ఆ కాలేజీ యాజమాన్యం కూడా షాక్ అయ్యింది..మరి ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం..


బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన కుందన్‌ కుమార్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు జరిగే క్రమంలో అతగాడి హాల్‌టికెట్ చూసిన బీం రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ తో పాటు అక్కడి బ్బంది షాక్ అయ్యారు.


కుందన్ కుమార్ హాల్‌టికెట్‌లో అతని తల్లి బాలివుడ్ స్టార్ సన్నీలీయోన్ అనీ..తండ్రి పేరు ప్రముఖ బాలివుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ అని ఉంది. అంతేకాదు..కుందన్ నివసించే ఏరియా పేరు ముజఫర్ పూర్ లోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన చతుర్బుజ్ స్థాన్‌లో నివసిస్తున్నట్లుగా ఆ హాల్ టికెట్ లో ఉంది. ఈ విషయాలు చూసిన సదరు వర్శిటీ టీమ్ ఒకటే ఆశ్చర్యపోతున్నారు. ఇదేందిరా బాబూ అనుకుంటున్నారు. ఇవసలు నిజమైనవేనా? లేదా ఆ స్టూడెంట్ ఆకతాయి తనంతో ఇలా క్రియేట్ చేశాడా? అని అనుమానిస్తున్నారు.


కుందన్ కుమార్ హాల్‌టికెట్ సోషల్ మీడియాకు లీక్ కావడంతో తెగ వైరల్ గా మారింది. మరి కాదేంటీ..అసలే సన్నీ క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంట్లో తమ నిర్లక్ష్యంతో ఏమీ లేదనీ..సదరు విద్యార్థే స్వయంగా దరఖాస్తులో అలా రాశాడని అధికారులు అంటున్నారు.


దీనిపై యూరివర్శిటీ రిజిస్ట్రార్ రామ్ కృష్ణ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై విచారణకు ఆదేశించామనీ..దీనిపై ఏం జరిగినా ఆ విద్యార్థే బాధ్యుడని స్పష్టంచేశారు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఈ పని చేసి ఉంటాడని భావిస్తున్నామని తెలిపారు. విచారణలో తేలిని నిజా నిజాలను బట్టి వాస్తవమైతే ఓకే..కానీ అవాస్తవమైతే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఆ హాల్‌టికెట్‌లోని ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు ద్వారా ఆ విద్యార్థి ఆచూకీ తెలుసుకుంటామని తెలిపారు. గతంలో సన్నీలియోన్ పేరు బీహార్ పీహెచ్ఈడీ మెరిట్ లిస్ట్‌లో కూడా కనిపించింది. పరీక్షల్లో ఆమె ఏకంగా 98.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు లిస్టులో చూపించారు.