హై ఫీవ‌ర్‌తో ఎగ్జామ్ సెంట‌ర్‌కొచ్చి విద్యార్థి దుర్మ‌ర‌ణం

హై ఫీవ‌ర్‌తో ఎగ్జామ్ సెంట‌ర్‌కొచ్చి విద్యార్థి  దుర్మ‌ర‌ణం

Bihar Student  విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచ‌న‌తో హై ఫీవర్‌తో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి కన్నుమూశాడు. గుండెలు పిండేసే ఘటన శుక్ర‌వారం బీహార్‌లో వెలుగు చూసింది

బీహార్ ష‌రీఫ్‌లోని ఆద‌ర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు. మొదట అత‌డి అనారోగ్య కార‌ణాల వ‌ల్ల సంబంధిత ప‌రీక్షా కేంద్రంలోని స్కూల్ యాజ‌మాన్యం అనుమ‌తి నిరాక‌రించినా.. సంవ‌త్స‌రం వేస్ట్ అవుతుంద‌న్న భ‌యంతో ప‌రీక్ష రాస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టాడు. దీంతో ప‌రీక్ష నిర్వాహ‌కులు జిల్లా ప‌రీక్ష‌ల కంట్రోల్ రూమ్‌తోనూ, అత‌డి త‌ల్లిదండ్రుల‌తోనూ సంప్ర‌దించారు.

చివ‌ర‌కు రోహిత్ కుమార్ త‌ల్లి వ‌చ్చి త‌న కొడుకును ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తించాల‌ని కోరింది. అయితే, శుక్ర‌వారం ప‌రీక్ష రాస్తుండ‌గా అత‌డి ఆరోగ్యం మ‌రింత దిగ‌జారింది. దీంతో రోహిత్‌ను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని డాక్టర్లు తెలిపారు. ఆస్త‌మా వ‌ల్లే రోహిత్ మ‌ర‌ణించాడ‌ని డాక్టర్లు చెప్పారు.

Bihar Student Reaches Board Exam Centre in High Fever To Save Year, Dies

బీఎస్ఈబీ బోర్డు ప‌రీక్ష‌ల్లో భాగంగా శుక్ర‌వారం సోష‌ల్ సైన్స్ ప‌రీక్ష ఫ‌స్ట్ షిప్ట్‌లో జ‌రిగింది. కానీ ప్ర‌శ్న‌ప‌త్రం లీకైంద‌ని వార్త‌లొచ్చాయి. దీంతో ఈ ప‌రీక్ష ర‌ద్దు చేశారు. వ‌చ్చే నెల 8వ తేదీన తిరిగి సోష‌ల్ సైన్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.