Private Part Chopped : దారుణం.. చెల్లిని ప్రేమించాడని, మర్మాంగం కోసి హత్య

బీహార్​ రాష్ట్రం ముజఫర్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడని, యువతి సోదరులు, ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.

Private Part Chopped : దారుణం.. చెల్లిని ప్రేమించాడని, మర్మాంగం కోసి హత్య

Private Part Chopped

Private Part Chopped : బీహార్​ రాష్ట్రం ముజఫర్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడని, యువతి సోదరులు, ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.

రామ్​పురుశాహ్​ ప్రాంతానికి చెందిన సౌరభ్ ​రాజ్(22)​.. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయినా వారు వినలేదు. ఇది తట్టుకోలేకపోయిన యువతి సోదరులు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్​ను తమ ఇంటికి పిలిపించారు. అనంతరం.. అతడిని గదిలో బంధించి దాడి చేశారు.

అంతేకాదు సౌరభ్​ మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సౌరభ్ చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్​ను ఓ ఆస్పత్రిలో చేర్చి పారిపోయారు. ఆసుపత్రిలో సౌరభ్ మృతి చెందాడు. ఈ ఘటనతో సౌరభ్ బంధువులు, గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. సౌరభ్​ మృతదేహంతో నిందితుల ఇంటి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. నిందితుల ఇంటి ముందే మృతదేహాన్ని దహనం చేశారు.