సొంత డబ్బుతో వంతెన నిర్మించుకున్న గ్రామస్తులు

  • Published By: nagamani ,Published On : September 17, 2020 / 11:16 AM IST
సొంత డబ్బుతో వంతెన నిర్మించుకున్న గ్రామస్తులు

ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు కావాలి. ఓట్ల కోసం కొండలు..గుట్టలు..కాలువలు..వాగులువంకలు దాటి మరీ వెళ్లి మారుమూల గ్రామాలకు వెళ్లి మరీ ఓట్లు అడుగుతారు. ఎన్నికలు అయిపోయాక తిరిగి ఆ ప్రజలవైపు కన్నెత్తి కూడా చూడరు. నన్ను గెలిపిస్తే మీ కనీస అవసరాలన్నీ తీర్చేస్తామని వాగ్దానాలు దంచికొడతారు ఓట్ల కోసం. తరువాత పత్తాలేకుండా పోతారు. ఇది అన్నిచోట్లా జరిగేదే. అదే జరిగింది బీహార్ లోని బుధౌల్ అనే గ్రామంలో. ప్రభుత్వాలు చేసే పనిని బుథౌల్ గ్రామస్తులంతా ఒకేమాటపై నిలబడి తమ అవసరాన్ని తామే తీర్చుకున్నారు. తమ సొంత డబ్బుతో వంతెన నిర్మించేసుకున్నారు.


రాష్ట్రంలోని గయ జిల్లాలోని బుధౌల్ గ్రామ సమీపంలోని ఓ వాగుపై వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ వంతెన బుధౌల్ గ్రామస్తులకు చాలా అవసరం. కానీ వంతెన నిర్మాణం ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఆ వంతెనను పూర్తి చేయమని ప్రభుత్వ అధికారుల చుట్టూ..తాము ఓట్లు వేసి గెలిపించిన నేతల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా..ఎన్ని సంవత్సరాలు తిరగినా ఫలితం లేదు. దీంతో సగంలో మిగిలిపోయిన ఆ వంతెనను తామే పూర్తి చేయాలని బుధౌల్ గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.


స్థానికంగా ఉండే సోషల్ వర్కర్ చిత్రరంజన్ కుమార్ బుధౌల్ సలహా మేరకు తామే వంతెన నిర్మాణం చేయాలనుకున్నారు. చిత్రరంజన్ కుమార్ సలహాలతో గ్రామస్థులతో కలిసి పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసుకుని వంతెన నిర్మాణానికి నిధులు సేకరించాలనుకున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా వంతెన నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ ను కొని తెచ్చుకుని వారే కూలీలుగా మారి..శ్రమదానంతో వంతెన నిర్మాణం పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు.



https://10tv.in/high-speed-rail-corridor-travel-time-from-mumbai-to-hyd/
డబ్బులు ఇవ్వలేని పేద కుటుంబాల వారు శ్రమదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతే బుధౌల్ గ్రామ వాగుపై వంతెన నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఈ వంతెన నిర్మాణం వల్ల ఎక్కడికన్నా తాము వెళ్లాలనుకుంటే 15 కిలోమీటర్ల దూరం కిలోమీటరుకు తగ్గిందని చిత్రరంజన్ కుమార్ చెప్పారు.


30 ఏళ్లుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసిన బుధౌల్ గ్రామస్థులు విసిగిపోయి తమ విరాళాలతో వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రజల కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలు ఉన్నాయని ఆగ్రామాలకైనా ప్రభుత్వం వారి అవసరాలను తీర్చాలను సూచించారు.