Araria Court : 8 ఏళ్ల బాలికపై రేప్..ఒక్కరోజులోనే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పిన బీహార్ కోర్టు

ఓ బాలిక అత్యాచారం కేసులో బీహార్ లోని అరారియా పోస్క్ కోర్టు.. విచారణను ఒక్కరోజులోనే పూర్తి చేసి అదే రోజు తీర్పు చెప్పి దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది

Araria Court : 8 ఏళ్ల బాలికపై రేప్..ఒక్కరోజులోనే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పిన బీహార్ కోర్టు

Court

Araria Court :  ఓ బాలిక అత్యాచారం కేసులో బీహార్ లోని అరారియా పోస్క్ కోర్టు.. విచారణను ఒక్కరోజులోనే పూర్తి చేసి అదే రోజు తీర్పు చెప్పి దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది. అక్టోబర్‌ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది.

ఈ ఏడాది జూలై 22న దిలీప్ కుమార్ యాదవ్‌ అనే వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన మరుసటి రోజు జులై23న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అరారియా మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా ఫాలో అప్​ చేశారు. త్వరితగతిన పక్కాగా సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అక్టోబర్ 4న ఈ కేసు కోర్టు ముందుకు రాగా…ఒక్కరోజులోనే జడ్జి శశికాంత్ రాయ్ విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు.

మొత్తం 10 మంది సాక్షులను విచారించారు. ఇరు వర్గాల వాదనలు, కౌంటర్ వాదనలు అంతా ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ప్రాసిక్యూషన్​ ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. నిందితుడు దిలీప్ కుమార్ యాదవ్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష తో పాటు రూ.50వేలు జరిమానా విధించింది. బాలిక భవిష్యత్ కోసం బాధితుల నష్టపరిహార నిధి నుంచి రూ.7 లక్షలు పరిహారంగా చెల్లించాలని జడ్జి ఆదేశించారు. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (POSCO)పై అరారియా కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది.రేప్‌ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్యామల యాదవ్‌ తెలిపారు.

ALSO READ ESIC హాస్పిటల్ నిర్వాకం..కరోనాతో చనిపోయిన ఏడాది తర్వాత మృతదేహాల అప్పగింత