ముంచేస్తున్నవర్షాలు:ఆస్పత్రిలోకి వరద..బీహార్‌లో రెడ్ అలర్ట్

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 09:43 AM IST
ముంచేస్తున్నవర్షాలు:ఆస్పత్రిలోకి వరద..బీహార్‌లో రెడ్ అలర్ట్

బీహార్‌లో గత రెండు రోజుల నుంచి వ‌ర్షాలు ఏక‌ధాటిగా కురుస్తున్నాయి. రాజ‌ధాని పాట్నాలోనూ భారీ నుంచి అతి భారీగా  వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. న‌లంద మెడిక‌ల్ కాలేజీలోకి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించింది. రోగులు ఉండే వార్డులు నీటితో నిండిపోయాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
భారీ వర్షాలకు రాష్ట్ర‌వ్యాప్తంగా 13 జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌, కంక‌ర్‌బాగ్‌, క‌దంకౌన్‌, పాట‌లీపుత్ర కాల‌నీల్లో వ‌ర్షపు నీరు ఇళ్లల్లోకి వరదనీరు చేరుకుంది. వ‌ర్షాల వ‌ల్ల టెలిఫోన్ లైన్లు, మొబైల్ స‌ర్వీసులు దెబ్బ‌తిన్నాయి. శుక్ర‌వారం (సెప్టెంబర్ 27)రాత్రి నుంచి పలు  ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ప‌లు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గవర్నమెంట్ ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు.

అనేక ప్రాంతాల్లో రైలు స‌ర్వీసుల్ని కూడా తాత్కాలింకగా నిలిపివేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ప్రజలంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. గంగా న‌ది ప్ర‌మాద‌క‌ర స్థాయిని దాటి ప్ర‌వ‌హిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది.