Smokeless ‘Chulhas’ : గాలి కాలుష్యానికి చెక్..అడవిబిడ్డల ఐడియా సూపర్

వాయి కాలుష్యాన్ని నివారించటానికి గిరిజనులు ‘పొగ రాని పొయ్యి’లను తయారు చేసుకున్నారు. ఎవరో వచ్చి వారికి ఇటువంటి ఐడియా ఇవ్వలేదు. వారికి వచ్చిన ఆలోచననే అమలులో పెట్టుకున్నారు. పొగరాని పొయ్యి లను తయారు చేసుకుని వంట చెరకు కోసం అడవుల్లో చెట్లను కొట్టటం మానేస్తున్నారు..ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అడవులు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. పొగరాని పొయ్యిలను వాడుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Smokeless ‘Chulhas’ : గాలి కాలుష్యానికి చెక్..అడవిబిడ్డల ఐడియా సూపర్

Bijapur Tribals Are Turning To Smokeless Chulas Or Stoves In An Attempt To Save Forests In Chhattisgarh

chhattisgarh tribals Smokeless ‘chulhas’ : గిరిజనులను అడవిబిడ్డలు అంటాం. ఎందుకంటే వాళ్లు అడవిమీద ఆధారపడి జీవిస్తుంటారు. అడవితే తల్లిగా భావిస్తారు. అడవిలో లభించేవాటిని సేకరించి అమ్ముకుని జీవిస్తుంటారు. అడవి అంటే వారి ఆవాసం మాత్రమే కాదు ప్రాణం. వనదేవతను కొలుచుకుంటారు. అటువంటి అవవిబిడ్డలు వాయు కాలుష్యం తగ్గించటానికి నడుం బిగించారు.ముఖ్యంగా గిరిజన స్త్రీలు దీన్నొక బాధ్యతగా భావించారు.దాని కోసం కలిసి కట్టుగా వాయి కాలుష్యాన్ని నియంత్నించాలని నడుం బిగించారు.

సాధారణంగా గిరిజనులు వంట చెరకు కోసం చెట్లమీదనే ఆధారపడతారు. కట్టెల పొయ్యిలమీదనే వంట చేసుకుంటారు. దీంతో వాయి కాలుష్యం పెరుగుతోందని భావించిన గిరిజనులు ‘పొగ రాని పొయ్యి’లను తయారు చేసుకున్నారు. ఎవరో వచ్చి వారికి ఇటువంటి ఐడియా ఇవ్వలేదు. వారికి వచ్చిన ఆలోచననే అమలులో పెట్టుకున్నారు. పొగరాని పొయ్యి లను తయారు చేసుకుని వంట చెరకు కోసం అడవుల్లో చెట్లను కొట్టటం మానేశారు..ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అడవులు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. పొగరాని పొయ్యిలను వాడుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

దట్టమైన అడవులకు పెట్టింది పేరైన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గిరిజనులు పొగరాని పొయ్యిలను తయారు చేసుకుని నిశ్శబ్ద విప్లవానికి తెర తీశారు. నక్సల్స్ కు కంచుకోటైన బీజాపూర్ జిల్లాలో గిరిపుత్రులు అడవులను కాపాడుకోవటానికి వంట చెరకు అవసరాలను సగానికి సగం తగ్గించుకుంటున్నారు. వంట కోసం రోజు విడిచి రోజు అడవి నుంచి కట్టెలు కొట్టి తెచ్చుకునేవారు గతంలో. కానీ ఇప్పుడలా కాదు. సంప్రదాయ పొయ్యిలను పక్కన పెట్టేశారు. ఇటుకలతో తయారు చేసి పొయ్యిలను తయారు చేసుకున్నారు. పొగపోవడానికి ఒక ఇనుపరాడ్‌ను పొగరాని పొయ్యిలను వాడుతున్నారు. ఈ పొయ్యిల వల్ల వంట..ఇతర అవసరాలకు వాడే కట్టెల వాడకం సగానికి సగం తగ్గించేసుకున్నారు. దీంతో వంట కోసం చెట్లు నరకం చాలా వరకూ తగ్గిపోయింది.సంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే ఈ పొగరాని పొయ్యిలతో సగానికి సగం కట్టెల వాడకం తగ్గిపోయింది. పైగా ఈ పొయ్యిలో ఆక్సిజన్ బాగా అంది మంట తగినంత వచ్చేలా తయారుచేసుకున్నారు. గతంలో ఉండే పొయ్యిల్లా కాకుండా మంట అటూ ఇటూ వెళ్లిపోకుండా అచ్చం గ్యాస్ పొయ్యిల్లాగా తయారు చేసుకున్నారు. దీంతో మంట వేస్టు అవ్వకుండా వంటకూడా త్వరగా అయిపోతోంది అంటున్నారు గిరిజన స్త్రీలు.దీంతో టైము ఆదా అవుతోంది..కట్టెల ఉపయోగం తగ్గిపోయిందంటున్నారు.

కాగా..అడవుల రాష్ట్రం అయిన ఛత్తీస్‌ఘడ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో ఇంటిలో ఏడాదికి దాదాపు 3వేల కిలోల కట్టెలు వాడుతున్నారని అంచనా. ఇప్పుడు ఈ పొగరాని పొయ్యిలతో అది 1500 కేజీలకు తగ్గిపోయిందట. అంటే ఏపుగా ఎదిగిన మూడు చెట్లను కొట్టకుండా కాపాడినట్లేనని శ్రీశ్రీ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీస్ చైర్మన్ రామకృష్ణ మూలే తెలిపారు. కాగా..దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందని చెబుతున్న పాలకులు ఇప్పటికూ దేశంలోని ఎన్నో గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదు. అలాగే గ్యాస్ పొయ్యిలు అందలేదు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ స్టవ్ లు పంపిణీ చేసే పథకం బీజాపూర్ గిరిపుత్రుల గ్రామాల గడపలకు చేరలేదు. అతి తక్కువమందికి మాత్రమే గ్యాస్ పొయ్యిలు అందాయి. కానీ సిలిండర్ అయిపోతే కొత్తది తెచ్చుకోవడం అంటే పెద్ద యజ్ఞమేనని చెప్పాలి.ఎందుకంటే ఆయా గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు కూడా లేవు.

దీంతో గ్యాస్ పొయ్యిలు అందినవారు కూడా కట్టెల పొయ్యిల్నే తిరిగి ఆశ్రయిస్తున్నారు. ఈక్రమంలో వంటచెరకు కోసం అడవులు తరిగిపోవటం..అలాగే పొయ్యిల నుంచి వచ్చే పొగతో అనారోగ్యాల పాలవ్వటంవంటివి జరుగుతున్నాయి. కానీ ఈ పొగరాని పొయ్యిలతో అడవిబిడ్డలు సరికొత్త ఐడియాకు తెరతీశారు. వారి సమస్యను వారే పరిష్కరించుకున్నారు. గిరిపుత్రులలో ఒకడైన అనిల్ కావ్రే ప్రభుత్వ ఆరోగ్య పథకాలను స్థానికులకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. పిల్లల్లో పోషకాహార లోపం ఇళ్ళల్లో పొయ్యిల వల్ల వాయు కాలుష్యం తగ్గించడానికి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పథకంలో చురుకుగా పాల్గొన్నాడు. అప్పుడే అతనికి ఈ పొగరాని పొయ్యిల గురించి తెలిసింది. తరువాత ఆ పథకం ఆగిపోయినా.. కారే మనసులో వాటి గురించి ఆలోచన అలాగే ఉండిపోయింది. దీంతో తన గ్రామంలోని మహిళలకు ఈ పొగరాని పొయ్యిల ఉపయోగాలను వివరించాడు. వారంతా పొగరాని పొయ్యిలు వాడేలా చేశాడు.

ఈ పొయ్యిల వినియోగం తెలిసిన పక్క గ్రామాల వారు కూడా బీజాపూర్ జిల్లాలోని గిరిపుత్రుల గ్రామాలకు వచ్చి ఈ పొగరాని పొయ్యిలను తయారు చేసుకుని వాయు కాలుష్యానికి చెక్ పెడుతున్నాయి. ఫలితంగా అటు అడవుల సంరక్షణ ఇటు ఆరోగ్య రక్షణ చేసుకోగలుగుతున్నారు. దీంతో వంట చేసుకోవటం కోసం గంటల తరబడి పొగ మధ్య నానా తంటాలు పడే గిరిజన స్త్రీలు వారి ఆరోగ్యాలకు కాపాడుకోవటమే కాకుండా వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నారు. ఈ పొగరాని పొయ్యి లను బీజాపూర్ జిల్లా అంతటా విస్తరించేలా కావ్రే తన బృందంతో పాలు కృషి చేస్తున్నారు.