ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి..మహిళా కానిస్టేబుల్‌ ను ఈడ్చుకెళ్లాడు

  • Edited By: veegamteam , November 8, 2019 / 09:20 AM IST
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి..మహిళా కానిస్టేబుల్‌ ను ఈడ్చుకెళ్లాడు

రాజస్థాన్‌లోని దిద్వానా పట్టణంలో బుధవారం (నవంబర్ 6, 2019)న బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. ఆపేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్‌ (యశోద)ను ఈడ్చుకెళ్లాడు. 

ఇక ఎంతకీ మహిళా కానిస్టేబుల్ ఆ బైక్ ను వదలకపోయేసారికి.. చివరికి స్లిప్‌ అయ్యి అందరూ కిందపడ్డారు. దీంతో వెంటనే బైక్‌ నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా.. దగ్గరలో ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయ్యింది.

కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం కానీ ఫోన్‌లో మాట్లాడుతుంటే పట్టుబడిన వ్యక్తులకు చలాన్ జారీ చేయాలని సీనియర్ అధికారులు  ఆదేశించినట్లు కానిస్టేబుల్ తెలిపారు.