రెండేళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ నిజం : ఆ బైక్ పై 189 చలాన్లు

చండీగఢ్‌ లో ఏకంగా 189 చలానాలు ఉన్న బైక్‌ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ బైక్ పై ఉన్న చలానాల గురించి దాని యజమానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 03:35 AM IST
రెండేళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ నిజం : ఆ బైక్ పై 189 చలాన్లు

చండీగఢ్‌ లో ఏకంగా 189 చలానాలు ఉన్న బైక్‌ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ బైక్ పై ఉన్న చలానాల గురించి దాని యజమానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఈ చట్టంలోని జరిమానాలు చూసి వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఈ చట్టం ప్రకారం ఒకటి, రెండు చలానాలు విధిస్తే చాలు.. ఆ సొమ్ము చెల్లించడానికి నెల జీతం సరిపోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఏకంగా 189 చలానాలు ఉన్న బైక్‌ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ బైక్ పై ఉన్న చలానాల గురించి దాని యజమానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చండీగఢ్‌కు చెందిన సంజు సెక్టార్ 39 లో నివాసముంటున్నాడు. సెక్టార్ 34లో ఉన్న ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. జులై 26న ఆఫీస్‌కు వెళ్తూ సెక్టార్‌ 33 ప్రాంతంలో రాంగ్‌ డైరెక్షన్‌లో యూ టర్న్‌ తీసుకున్నాడు. దాంతో ట్రాఫిక్‌ పోలీస్ అతనికి రూ.300 చలానా విధించి జిల్లా కోర్టుకు పంపించారు. అతని పేరు మీద నమోదు చేయబడిన బైక్‌పై 2017-19 మధ్య కాలంలో 189 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు చూపించాయి. దీంతో సంజు ఆశ్చర్యపోయారు.

తనపై 189 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసి తాను షాక్‌కు గురయ్యానని సంజు చెప్పారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక తాను జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నానని తెలిపారు. ఇన్ని చలాన్లు తనపై పెండింగ్‌లో ఉన్నాయని ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఏడాదిన్నర క్రితం సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఈ చలాన్ల గురించి ట్రాఫిక్‌ పోలీసులు కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నాడు. ఇప్పుడు చలానాలను చెల్లించడం కంటే బైక్‌ను ఇక్కడే వదిలేసి వెళ్లడం మంచిది అన్నాడు.

జూలైలో ఇలాంటి కేసులో 23 ఏళ్ల మిల్క్‌ మ్యాన్ హెల్మెట్ లేకుండా స్వారీ చేసినందుకు ఏడు నెలల్లో 36 సార్లు చలాన్ వేశారు. అన్ని నేరాలు ఒకే సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. డిసెంబర్ 2018 మరియు జూన్ 2019 మధ్య కాలంలో టివిఐఎస్ జారీ చేశారు. అయితే అడ్రస్ మార్పు కారణంగా అతనికి ఎప్పుడూ చేరుకోలేదు.

పోలీసులు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న టీవీఐఎస్ గురించి టెక్స్ట్ సందేశాల ద్వారా రిమైండర్‌లు పంపడం ప్రారంభించారు. మూడు రిమైండర్‌ల తర్వాత ఒక వ్యక్తి చలాన్లను క్లియర్ చేయడంలో విఫలమైతే వాహనం నిర్బంధించబడుతుందని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి, ట్రాఫిక్) శశాంక్ ఆనంద్ తెలిపారు.

వాస్తవానికి, పెండింగ్‌లో ఉన్న టీవీఐఎస్ ఉన్న వాహనాలు బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి. వాటిని అమ్మడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. వారి కాలుష్యం అండర్ కంట్రోల్ (పియుసి) ధృవపత్రాలు కూడా నవీకరించబడవు.