Modi-Boris Johnson : ప్రధాని మోదీ, బోరిస్ జాన్సన్ భేటీ..రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

గతేడాది భారత్-బ్రిటన్​ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్​టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Modi-Boris Johnson : ప్రధాని మోదీ, బోరిస్ జాన్సన్ భేటీ..రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

Modi Boris

UK PM Boris Johnson : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారతలో పర్యటిస్తున్నారు. భారత ప్రధాని మోదీ, బోరిస్ జాన్సన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ సమయంలోనే బోరిస్​ భారత పర్యటనకు రావడం చారిత్రాత్మకం అన్నారు. గత కాప్​ 26 సమావేశంలో చేసుకున్న వాగ్ధానాలను నేరవేర్చేందుకు కట్టుబడి ఉండాలనుకుంటున్నామని చెప్పారు.

భారత జాతీయ​ హైడ్రోజన్ మిషన్​లో చేరాలని బ్రిటన్​ను ఆహ్వానించామని పేర్కొన్నారు. స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, నియమ ఆధారిత ఇండో పసిఫిక్​ ప్రాంతం ఉండాలని నొక్కి చెబుతున్నామని తెలిపారు. గతేడాది భారత్-బ్రిటన్​ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్​టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయని చెప్పారు.

UK PM Boris Johnson : అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై కూడా చర్చించామని, ఇవేగాక అంతర్జాతీయ అంశాలపైనా చర్చించామని వెల్లడించారు. ఉక్రెయిన్​లో కాల్పుల విరమణ జరిగి తక్షణం చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించువాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తన పర్యటనతో భారత్​-బ్రిటన్ మధ్య బంధం మరింత బలపడిందన్నారు. గత సంవత్సరం నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిరంకుశత్వం, బెదిరింపులు మరింత పెరిగాయని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛగా ఉంచడం ఉమ్మడి లక్ష్యం అన్నారు. ఈ ప్రాంతంలో నింగి, నేల, సముద్రం నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

mukhtar abbas naqvi: మీది ‘ఇండియా ఫోబియా’.. బ్రిటన్ ఎంపీకి భారత్ ఘాటు రిప్లై

స్థిరమైన స్వదేశీ ఇంధనం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ రోజు ద్వైపాక్షిక చర్చలు అద్భుతంగా జరిగాయని అభిప్రాయపడ్డారు. తమ సంబంధాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నామని చెప్పారు. భారత్​, బ్రిటన్ మధ్య భాగస్వామ్యం.. మన కాలంలో నిర్వచించే స్నేహాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు.