Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్

రానున్న రోజుల్లో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే ఎక్కువగా.. రోగనిరోధకతను సంపాదిస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డాడు

Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్

Bill Gates

Bill Gates: మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ అపరకుబేరుడు బిల్ గేట్స్.. మరోసారి కరోనా నిర్ములనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రానున్న రోజుల్లో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే ఎక్కువగా.. రోగనిరోధకతను సంపాదిస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డాడు. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ కు చెందిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ దేవి శ్రీధర్ తో బుధవారం ట్విట్టర్ వేదికగా బిల్ గేట్స్ మాట మంతి నిర్వహించారు. ఈసందర్భంగా కరోనా వ్యాప్తి నిర్ములనపై ప్రొఫెసర్ దేవి శ్రీధర్ అడిగిన పలు ప్రశ్నలపై బిల్ గేట్స్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Also read: Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

కరోనా ఓమిక్రాన్ వేరియంట్ తో మనుషుల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఏమి లేకపోయినా.. వైరస్ ఉదృతిని తట్టుకోలేమని బిల్ గేట్స్ పేర్కొన్నారు. వైరస్ కేసులు పెరిగినకొద్దీ వైద్యవవస్థకు అది సవాలుగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కరోనాతో సహజీవనం కొనసాగాల్సిందేనా అంటూ ప్రొఫెసర్ దేవి అడిగిన ప్రశ్నకు గేట్స్ బదులిస్తూ.. కరోనా వ్యాప్తిని పెంచే కొత్త వేరియంట్ లు ఇకపై రాకపోవచ్చని, అయితే ఇప్పటి వరకు వచ్చిన కొత్త వేరియంట్లు మనుషుల ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఇప్పటికి పెరుగుతున్న కేసులన్నీ.. వాక్సిన్ అందుబాటులోలేని దేశాల నుంచి వచ్చినట్లు బిల్ గేట్స్ గుర్తుచేశారు.

Also read: UK : దేశంలోనే రికార్డు సృష్టించిన శిశువు..అమ్మకు 17 ఏళ్లే

ఇక కరోనాను అంతం చేసేందుకు ఇప్పటివరకు వచ్చిన వాక్సిన్లు సరిపోయినట్టేనా అని ప్రొఫెసర్ దేవి అడిగిన ప్రశ్నకు.. బిల్ గేట్స్ స్పందిస్తూ..వాక్సిన్ల ద్వారా జబ్బు తీవ్రతను, ప్రాణాపాయాన్ని తప్పించగలిగామని, అయితే ఇప్పుడున్న వాక్సిన్ లలో రెండు ప్రధాన లోపాలు ఉన్నట్లు బిల్ గేట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వాక్సిన్ తీసుకున్నా అవి ఎక్కువకాలం ప్రభావం చూపడం లేదని తద్వారా కరోనా తిరిగి వచ్చే అవకాశం ఉందని బిల్ గేట్స్ అన్నారు. వైరస్ ను పూర్తిగా నిలువరించి.. ఎక్కువ కాలం నిలకడగా ఉండే వాక్సిన్లను అభివృద్ధి చేయడం మరో సవాలుగా బిల్ గేట్స్ పేర్కొన్నారు.

Also read: Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!