Biological E Corbevax : బయో-ఈ కార్బెవాక్స్.. భారత్‌లో ఇదే చౌకైన టీకా కావొచ్చు!

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదుకు రూ.250 ధరకే రానుంది. అత్యవసర వినియోగానికి ఈయూఏ ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కావొచ్చు.

Biological E Corbevax : బయో-ఈ కార్బెవాక్స్.. భారత్‌లో ఇదే చౌకైన టీకా కావొచ్చు!

Vaccination

Biological E Corbevax Vaccine: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదుకు రూ.250 ధరకే రానుంది. అత్యవసర వినియోగానికి ఈయూఏ ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో రాబోయే అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కావొచ్చు. ప్రస్తుతం, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు మోతాదుల కోవిషీల్డ్‌ను రూ .600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయిస్తోంది.

భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ రెండు షాట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 800 విక్రయిస్తోంది. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మోతాదుకు రూ. 995 చొప్పున విక్రయిస్తోంది. కార్బెవాక్స్ వ్యాక్సిన్ రెండు డోసుల ధరను రూ. 400 రూపాయలకు తగ్గించే అవకాశం ఉన్నట్టు సంబంధింత వర్గాలు వెల్లడించాయి. 30 కోట్ల కార్బెవాక్స్ వ్యాక్సిన్ మోతాదుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బయోలాజికల్-ఈకి రూ. 1,500 కోట్లు ముందుగానే చెల్లించినట్టు సమాచారం.

కార్బెవాక్స్ మూడవ దశ ట్రయల్స్‌లో ఉంది. ఫేజ్ I & II ట్రయల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. కేంద్రం రూ. 30 కోట్ల మోతాదులను ముందస్తుగా బుక్ చేసింది. ఒక మోతాదుకు రూ. 50 చొప్పున 1,500 కోట్లు చెల్లించినట్టు తెలిసింది. టీకాకు జూలై-ఆగస్టు నాటికి EUA ఆమోదం లభిస్తే.. అది పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ధరను గణనీయంగా తగ్గించే అవకాశం లేకపోలేదు.