Corbevax Vaccine: రూ.590 తగ్గిన వ్యాక్సిన్ ధర.. ఇప్పుడు రూ.250 మాత్రమే
హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) ఫార్మాసూటికల్ కంపెనీ Corbevax వ్యాక్సిన్ ధరను రూ.590 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 12 నుంచి 17సంవత్సరాల వయస్సు గల వారికి అందించే వ్యాక్సిన్‌ను రూ.840ధర నుంచి రూ.250కు తగ్గించారు.

Vaccine 11zon 1
Corbevax Vaccine: హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) ఫార్మాసూటికల్ కంపెనీ Corbevax వ్యాక్సిన్ ధరను రూ.590 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 12 నుంచి 17సంవత్సరాల వయస్సు గల వారికి అందించే వ్యాక్సిన్‌ను రూ.840ధర నుంచి రూ.250కు తగ్గించారు.
అన్ని ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో ఇది దొరుకుతుంది. ఇక ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ కలిపి డోస్ కోసం రూ.400వరకూ వెచ్చించాల్సి ఉంటుంది.
దీన్ని మరింత తగ్గించడానికి కారణం.. వైరస్ నుండి గరిష్ట సంఖ్యలో పిల్లలను రక్షించడానికి, వ్యాక్సిన్ తీసుకునేవాళ్లను పెంచడానికేనని కంపెనీ తెలిపింది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్కులకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA)ని దక్కించుకున్న వారాల్లోనే బయోలాజికల్ E. లిమిటెడ్ ఈ నిర్ణయానికి వచ్చింది.
గతంలో ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ మార్కెట్ ధర రూ. పన్నులు, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలతో సహా డోస్ 990.
Read Also: భారీగా తగ్గిన కొవిడ్ వ్యాక్సిన్ ధర.. రూ.225మాత్రమే
Corbevax వ్యాక్సినేషన్ స్లాట్‌ను 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు Co-WIN యాప్ లేదా Co-WIN పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 43.9 మిలియన్ డోస్‌ల Corbevax పిల్లలకు అందించారు.