Bio E Plan : వచ్చే ఆగస్టు నుంచి 80 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

భారత బయోలాజికల్ ఇ. లిమిటెడ్ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. వచ్చే ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

Bio E Plan : వచ్చే ఆగస్టు నుంచి 80 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

Biological E To Begin Phase Iii Trial Of Covid Vaccine, Production From August (1)

Biological E to begin production from August : భారత బయోలాజికల్ ఇ. లిమిటెడ్ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. వచ్చే ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, డైనవాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌తో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

గత నెల చివరిలో మూడవ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి భారత డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందింది. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దట్ల పేర్కొన్నారు. రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్తేజపరిచే రీకాంబినెంట్-ప్రోటీన్ టెక్నాలజీని ఉపయోగించి వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని అంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు నుంచి దేశంలోని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

బయోలాజికల్ ఇ. కరోనా మందుకు అత్యవసర వినియోగ అధికారం (EUA) కోసం దరఖాస్తు చేస్తుందని దట్ల చెప్పారు. ఆగస్టు నుంచి వ్యాక్సిన్ ఎంతమొత్తంలో ఉత్పత్తి చేయాలనేది EUA ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. నెలకు 75-80 మిలియన్ మోతాదులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనావైరస్ కేసుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా కరోనావైరస్ భారత్ లో విజృంభిస్తోంది.

1.35 బిలియన్ల ప్రజలలో 10శాతం మాత్రమే పాక్షికంగా లేదా పూర్తిగా రోగనిరోధక శక్తి ఉంది. మొత్తం 163 మిలియన్ మోతాదుల ఆస్ట్రాజెనెకా షాట్‌ దేశీయంగా కోవాక్సిన్ అందిస్తున్నారు. రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మోతాదులు కూడా చేరాయి. దేశంలో ఈ వ్యాక్సిన్లను ఇంకా ప్రారంభించలేదు.