Bipin Rawat : భారీ శబ్దం వచ్చింది.. హెలికాప్టర్ రెక్కలు చెట్లను తగలడం చూశాం – ప్రత్యేక్ష సాక్షులు

బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. లోయలోంచి పైకి వస్తున్న సమయంలో హెలికాప్టర్ కొండను ఢీకొన్నట్లు తెలిపారు.

Bipin Rawat : భారీ శబ్దం వచ్చింది.. హెలికాప్టర్ రెక్కలు చెట్లను తగలడం చూశాం – ప్రత్యేక్ష సాక్షులు

Bipin Rawat (2)

Bipin Rawat : బుధవారం తమిళనాడులోని కానూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది ఉండగా వారిలో సీడీఎస్ బిపిన్ రావత్, వారి సతీమణి మధులిత రావత్ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన 7 గంటలకు రావత్ మృతి చెందినట్లు అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఇక ఈ ప్రమాదంపై స్థానికంగా నివాసం ఉంటున్న నంజప్పన్ సతీరాం మీడియాతో మాట్లాడారు.

చదవండి : Bipin Rawat : ఆ హెచ్చరిక చేసిన మరుసటి రోజే ఘోరం.. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం

ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని ఆ తర్వాత హెలికాఫ్టర్ రెక్కలు చెట్లకు తగిలి శబ్దం మరింత పెరిగిందని తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో భయాందోళనకు గురైనట్లు వివరించారు సీతారాం. బయటకు వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయని.. కాపాడండంటూ కొందరు కేకలు వేశారని.. అంతలోనే పూర్తిగా మంటలు అంటుకున్నాయని తెలిపారు. మంటల తీవ్రతకు తాము హెలికాప్టర్ వద్దకు వెళ్లలేకపోయామని తెలిపారాయన.అయితే సీతారాం చెప్పిన వివరాల ప్రకారం హెలికాప్టర్ లోయలోంచి వచ్చి కొండను ఢీకొన్నట్లుగా ఉంది. ఆ సమయంలో మేఘాలు దట్టంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

మరో ప్రత్యేక్ష సాక్షి ఘటనపై వివరిస్తూ.. హెలికాప్టర్ రెక్కల శబ్దం విని బయటకు వచ్చి చూశామని అప్పటికే మంటలు వ్యాపించాయని తెలిపారు. దిగువ లోయనుంచి హెలికాప్టర్ నిటారుగా పైకి రావడం చూశామని వివరించారు. క్షణాల్లో మంటలు వ్యాపించాయన్నారు. మంటలు చాలాపెద్దగా రావడంతో తాము వారిని కాపాడలేకపోయామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో గ్రామంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

చదవండి : Bipin Rawat : నాడు మృత్యుంజయుడు.. స్వల్పగాయాలతో బయటపడ్డ బిపిన్ రావత్

మరో ప్రత్యేక్ష సాక్షి చంద్ర కుమార్ మాట్లాడుతూ.. పెద్దగా శబ్దం రావడంతో ఎల్పీజి సిలిండర్ పేలిపోయిందని భావించామని తెలిపారు. పేలుడు తీవ్రత చాలా పెద్దదిగా ఉందని తెలిపారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి వెళ్లే హెలికాప్టర్లు సాధారణంగా సెటిల్‌మెంట్ మీదుగా ఎగురుతాయని, అయితే ప్రమాదం జరిగినప్పుడు భారీగా మేఘాలు కమ్ముకున్నాయని ఆయన చెప్పారు. హెలికాప్టర్ ఇళ్ళమీద కూలివుంటే మృతుల సంఖ్య మరింత అధికంగా ఉండేదని తెలిపారాయణ.