BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి

నీముచ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్‌ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. నీ పేరేంట్రా..? నీ ఆధార్‌ కార్డు తీయ్‌ ముసలోడా అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది.

BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి

Attack 11zon

BJP activist attack : మతం పేరిట మానసిక వికలాంగుడు, అందునా వృద్ధుడిపై దాడి చేసి చంపేసినహేయనీయమైన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. దాడి చేసింది బీజేపీ మాజీ కార్పొరేటర్‌ భర్త కావడంతో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మానసిక వికలాంగుడైన ఓ వృద్ధుడిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరించడం, మతం పేరిట అతనిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించడంతో.. తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ విమర్శలు రావడంతో.. పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేశారు.

నీముచ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్‌ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. నీ పేరేంట్రా..? నీ ఆధార్‌ కార్డు తీయ్‌ ముసలోడా అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది. పాపం.. ఏ జరుగుతుందో కూడా అర్థం కానీ స్థితిలో ఆ వృద్ధుడు అవస్థ పడ్డాడు. తన దగ్గరున్న డబ్బు సంచి చూపించే ప్రయత్నం చేయగా.. నిందితుడు పదే పదే ఆ వృద్ధుడిపై దాడి చేశాడు.

CM Kejriwal : సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి..మెయిన్‌గేట్‌, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం

బాధితుడిని రట్లమ్‌ జిల్లా సాస్రికి చెందిన భన్వర్‌లాల్‌ జైన్‌గా పోలీసులు గుర్తించారు. ఈయన కుటుంబం రాజస్థాన్‌లో దైవదర్శనానికి వెళ్లింది. అయితే అక్కడే ఆయన తప్పిపోయాడు. మే 15 నుంచి భన్వర్‌లాల్‌ కనిపించకుండా పోయాడని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వీడియో వెలుగులోకి వచ్చి అసలు విషయం తెలయడంతో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.