Himanta Sarma: అందుకే ముస్లిం వ్యక్తుల్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది: అస్సాం సీఎం

పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల సంతోనాత్పత్తిని పోల్చడం దుర్మార్గమని శర్మ అన్నారు.

Himanta Sarma: అందుకే ముస్లిం వ్యక్తుల్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది: అస్సాం సీఎం

BJP against Muslim men having multiple wives says Assam CM

Himanta Sarma: ముస్లిం వ్యక్తులు ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉంటారని, అందుకే భారతీయ జనతా పార్టీ వారికి వ్యతిరేకమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అన్నారు. ఒక మహిళ 20 నుంచి 25 మంది పిల్లల్ని కనగలదంటూ ఏఐయూడీఎఫ్ నేత, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత మంది పిల్లల్ని కనడం మంచిదే కానీ, వారికి తిండి, బట్టలు, విద్య, వైద్యానికి అయ్యే ఖర్చులను విపక్ష నేత భరిస్తారా అంటూ శర్మ ప్రశ్నించారు.

Collegium: కొలీజియం వ్యవస్థపై కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చి సుప్రీం కోర్టు

‘‘ముగ్గురు, నలుగురు భార్యల్ని పెళ్లి చేసుకో్వడానికి ఏ వ్యక్తికీ హక్కు లేదు (ఆయన ఉద్దేశంలో విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకునే హక్కు). మనం ఈ విధానాన్ని మార్చి తీరాలి. ముస్లిం మహిళలకు న్యాయం చేయాలి. మేం అందరితో పాటు ఉంటూనే అందరి క్షేమం కోరుకుంటాము. హిందువుల నుంచి డాక్టర్లు ఉన్నారు. ముస్లింల నుంచి కూడా డాక్టర్లు ఉన్నారు. కొంత మంది ఇచ్చే సలహాలను పాటించాల్సిన అవసరం లేదు. కానీ, పోమువా ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు అలాంటి సలహాలు ఇవ్వరు’’ అని శర్మ అన్నారు.

White House: అమెరికాతో పొత్తు కాదు, ప్రపంచంలోనే శక్తి అవుతుంది.. భారత్‭పై వైట్‭హౌస్ ప్రశంసలు

పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల సంతోనాత్పత్తిని పోల్చడం దుర్మార్గమని శర్మ అన్నారు. ఇక రాష్ట్రంలో చాలా మదర్సాలను ఇప్పటికే మూసివేయడంపై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలోని ముస్లిం పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలకు పంపి వారిని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని తాను కలలు కంటున్నట్లు శర్మ పేర్కొన్నారు.

New CM: నేడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించనున్న కాంగ్రెస్