Lok Sabha elections-2024: ఇలాగైతే బీజేపీని వచ్చే ఎన్నికల్లోనూ ఓడించలేం: ప్రశాంత్ కిశోర్

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.

Lok Sabha elections-2024: ఇలాగైతే బీజేపీని వచ్చే ఎన్నికల్లోనూ ఓడించలేం: ప్రశాంత్ కిశోర్

Lok Sabha elections-2024

Lok Sabha elections-2024: బీజేపీకి 2024 లోక్ సభ ఎన్నికల్లో సవాలు విసరాలని విపక్ష పార్టీలు భావిస్తుంటే పలు విషయాలను గుర్తించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. సైద్ధాంతిక విభేదాలు, అస్థిరత్వ రాజకీయాలు చేస్తే లాభం లేదని చెప్పారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

“బీజేపీకి సవాలు విసరాలంటే ముందుదాని బలాల గురించి అర్థం చేసుకోవాలి. హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమవాదం… ఈ మూడు అంచెల స్తంభంపై ఆధారపడి ఉంది. మీరు కనీసం రెండింటిని అధిగమించలేకపోతే బీజేపీకి సవాలు విసరలేరు. హిందుత్వ భావజాలంపై పోరడడానికి పలు సిద్ధాంతాలను అనుసరించాలి. గాంధేయవాదులు, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు… ఉన్నారు.

సిద్ధాంతం చాలా ముఖ్యం.. అయితే, ఆ సిద్ధాంత మూలాలపై గుడ్డి నమ్మకం మాత్రం ఉండకూడదు. పార్టీలు, నేతలు ముందుకు వచ్చి మాట్లాడుకోవడం, టీకి ఆహ్వానించుకోవడం వంటివి మాత్రమే చూస్తున్నాం. ఎవరు ఎవరితో కలిసి భోజనం చేస్తున్నారనేదే చూస్తున్నాం. అయితే, నేను ఓ సిద్ధాంత నిర్మాణ కోణంలో చూస్తున్నాను. ఇటువంటిది జరగకపోతే బీజేపీని ఓడించలేము” అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూనే కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. కొత్త కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

MLA Rajasingh : బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పట్టించుకోరా? జైశ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తేనే కేసు బుక్ చేస్తారా?