UP BJP : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి భేటీ..టికెట్ల ఖరారుపై చర్చ

ఎన్నికల దగ్గరలోనే ఉండడంతో టికెట్ల ఖరారు అంశంపై దృష్టి సారించింది. అందులో భాగంగా...ఎన్నికల కమిటీ భేటీ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు...

UP BJP : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి భేటీ..టికెట్ల ఖరారుపై చర్చ

Up Election

BJP Central Election Committee : దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని భావిస్తున్న యూపీ ఎన్నికలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేపట్టాయి. కానీ…కోవిడ్, ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండడంతో ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది ఈసీ. కానీ..బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. యోగి కేబినెట్ నుంచి కొంతమంది మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుండడంతో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది.

Read More : Covid in china : ఐరన్ బాక్సుల్లో గ‌ర్భిణులు,చిన్నారుల నిర్భంధం..వృద్ధులను కూడా వదలని చైనా Viral video

ఎన్నికల దగ్గరలోనే ఉండడంతో టికెట్ల ఖరారు అంశంపై దృష్టి సారించింది. అందులో భాగంగా…2022, జనవరి 13వ తేదీ గురువారం ఎన్నికల కమిటీ భేటీ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. అయితే..బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యులుగా ఉన్న జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీహార్ మంత్రి షాన్ వాజ్ హుస్సేన్ లు కరోనా బారిన పడడంతో వీరు హాజరు కావడం లేదు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

Read More : Chintapalli Murder : చింతపల్లి కేసు..మొండెం ఎక్కడ ?

ఢిల్లీలో ఉన్న బీజేపీ కేంద్ర కార్యాలయం నుండి జరిగే సమావేశానికి యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఎన్నికల ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ లు నేరుగా హాజరయ్యారు. నరేంద్రమోదీ, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, షాన్ వాజ్ హుస్సేన్, జువల్ ఓరమ్, వనతి శ్రీనివాసన్ లు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఏడు విడతలుగా యూపీ ఎన్నికల్లో పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి10న మొదటి విడత ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు చేయనుంది బీజేపీ.