అఖిలేష్ పై భోజ్ పురీ సూపర్ స్టార్ ని పోటీకి దించిన బీజేపీ

10TV Telugu News

ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి. యూపీలోని అజమ్ ఘర్ స్థానం నుంచి భోజ్ పురి స్టార్ దినేష్ లాల్ యాదవ్ నిర్హౌను బీజేపీ బరిలోకి దించింది.ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అజమ్ ఘర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా మెయిన్ పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పై పోటీకి ప్రేమ్ సింగ్ సఖ్యాను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.2014 ఎన్నికల్లో మెయిన్ పురి నుంచి పోటీ చేసి ములాయం భారీ మెజార్టీతో విజయం సాధించిన విజయం తెలిసిందే.మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

బుధవారం విడుదల చేసిన జాబితాలో ముంబై నార్త్ ఈస్ట్ సిట్టింగ్ ఎంపీ కిరిత్ సోమాయియాకి బీజేపీ ఝలక్ ఇచ్చింది.ఆమె స్థానంలో మనోజ్ కొటక్ ను ముంబై నార్త్ ఈస్ట్ అభ్యర్థిగా ప్రకటించింది.శివసేన ఒత్తిడి మేరకే పార్టీ సీనియర్ లీడర్ అయిన సోమాయియాకి బీజేపీ టిక్కెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.