వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం, ఢిల్లీకి ఐదుగురు టీఎంసీ నేతలు

వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం, ఢిల్లీకి ఐదుగురు టీఎంసీ నేతలు

TMC rebels to Delhi : వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం కొనసాగుతోంది. మమత బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధిష్టానానికి చెందిన కీలక నేతలు పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. టీఎంసీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా..పలువురు టీఎంసీకి రాం..రాం..చెప్పి కాషాయ కండువా కప్పుకుంటున్నారు.

సువేందు అధికారి ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యారు. తాజాగా…టీఎంసీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలు ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో..వీరు కూడా బీజేపీలో చేరుతున్నారనడానికి బలం చేకూరుతోంది. హౌరాలో అమిత్ షా నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొని..బీజేపీ చేరాల్సి ఉంది అయితే..షా పర్యటన రద్దయ్యింది. వీరంతా ఇప్పటికే టీఎంసీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరనున్న వారిలో ఎమ్మల్యేలు వైశాలి దాల్మియా, ప్రబిర్ ఘోషల్, హౌరా మేయర్ రతిన్ చక్రవర్తితో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, పౌర సంబంధిత శాఖకు ఐదు సార్లు చీఫ్‌గా పని చేసిన రంగనాథ్ పార్థసారథి ఛటర్జీ ఉన్నారు.

హౌరాలోని డుముర్జోలాలో ఆదివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన..మెగా ర్యాలీ జరుగుతుందని తెలుస్తోంది. అమిత్ షాతో పాటు..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొననున్నారు.