Kalita Majhi : పనిమనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ

సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి. అందుకే క్యాష్ పార్టీలకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తుంటాయి. ఈ రోజుల్లో రాజకీయాలు, ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీగా మారాయి. అందుకే బాగా డబ్బున్న వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఇది కామన్. కానీ, పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.

Kalita Majhi : పనిమనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ

House Help Kalita Majhi

bjp gives mla ticket to house help : సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి. అందుకే క్యాష్ పార్టీలకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తుంటాయి. ఈ రోజుల్లో రాజకీయాలు, ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీగా మారాయి. అందుకే బాగా డబ్బున్న వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఇది కామన్.

కానీ, పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ ఓ కామన్ మ్యాన్ కి అదీ పనిమనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి కలితా మాంజీ అనే పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది బీజేపీ. ఆమెకి టికెట్ ఇవ్వడం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలీ కలితా ఎవరు? అంటూ ఆమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.

Kalita Majhi

కలితా మాంజీ.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఓ చెరువు పక్కన పూరింట్లో ఉంటుంది. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రతీరోజూ నాలుగిళ్లలో పనిచేస్తుంది. నెలకు రూ. 2,500 వరకూ సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త ప్లంబర్. దంపతులు రోజంతా కష్టపడితే కానీ నాలుగు మెతుకులు దొరకవు. అదే సమయంలో కలితా మాంజీ ఐదేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది.

kalita

వెస్ట్ బెంగాల్ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి.. మరింత యాక్టివ్ అయ్యింది. బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె నెల రోజుల పాటు సెలవు పెట్టి ప్రచారం కొనసాగిస్తోంది. తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి… ‘‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’’ అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధిస్తోంది కలితా మాంజీ.

”నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుం ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాను. ముందుకు సాగమని, ఎన్నికల్లో విజయం సాధించాలని… నా తోటి పని మనుషులు నన్ను ప్రోత్సహించారు” అని కలితా చెప్పారు. కలితా తాను ఇంటి సహాయకురాలిని కావడం, దీనికితోడు పేద కుటుంబానికి చెందిన దాన్ని కావడంతో అందరి కష్టాలు తనకు తెలుసని కలితా మాంజీ అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే పేదలకు మరింత సాయం చేయగలుగుతానని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కలితా మాంజీ. కలితాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించారు. కలితా గెలిస్తే తమ జీవితాలు బాగుపడతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.

పనిమనిషి అయిన కలితాతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీ చందనా బైరీకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. వీరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

kalita majhi