BJP Shocked Purandeswari : పురందేశ్వరికి బీజేపీ షాక్..ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఇంఛార్జీ పదవుల నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్‌ షాక్ ఇచ్చింది. పార్టీ కీలక పదవుల నుంచి ఆమెను తొలగించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పార్టీ విభాగాల ఇంఛార్జీ పదవుల నుంచి ఆమెను తప్పించింది.

BJP Shocked Purandeswari : పురందేశ్వరికి బీజేపీ షాక్..ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఇంఛార్జీ పదవుల నుంచి తొలగింపు

BJP Shocked Purandeswari

BJP Shocked Purandeswari : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్‌ షాక్ ఇచ్చింది. పార్టీ కీలక పదవుల నుంచి ఆమెను తొలగించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పార్టీ విభాగాల ఇంఛార్జీ పదవుల నుంచి ఆమెను తప్పించింది. ఛత్తీస్‌గఢ్ ఇంఛార్జీగా మరొకరిని నియమించారు. ఒక్కసారిగా పురందేశ్వరిని పార్టీ పదవులు, బాధ్యతల నుంచి తప్పించడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను ఎందుకు పక్కన పెట్టారో హైకమాండ్‌ చెప్పకపోవడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ పార్టీ మనుగడ కోసం కృషిచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిపై బీజేపీ నాయకత్వం చిన్నచూపు చూస్తోందనడానికి ఆమెను పార్టీ కీలక పదవి నుంచి తప్పించడమే నిదర్శనం. అంతేకాకుండా ఒడిశా ఇంఛార్జీగా మరో వ్యక్తిని నియమించడంతో ఆమె వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పురందేశ్వరిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో కూడా పార్టీ ఆమెకు సమాచారం ఇవ్వకపోగా.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పార్టీ విభాగాల ఇంఛార్జీ పదవి నుంచి కూడా ఆమెను తప్పించారు.

Purandeswari : ఎక్కడికీ పోదు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్‌లో మోదీ, అమిత్‌షాకు సన్నిహితుడైన ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను నియమించారు. ఛత్తీస్‌గఢ్‌లో నడ్డ పర్యటన అనంతరం ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం. పార్టీ హైకమాండ్‌ అంచనాలకు తగ్గట్టుగా పురందేశ్వరి పార్టీ బలోపేతానికి కృషి చేయకపోవడమే ఈ మార్పులకు కారణమని సర్వత్రా చర్చ జరుగుతోంది. 2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారు.

ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వరికి కీలక పదవులు అప్పగిస్తే ఏపీలో పార్టీలోకి చేరికలు ఉంటాయిని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, హైకమాండ్ ఆశించినట్లుగా చేరికలు జరుగకపోవడంతో పార్టీ హైకమాండ్ నేతలు ఆమెపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చర్చ నడుస్తోంది. చేరికల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ పెద్దలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆమె బాధ్యతల్లో కోత విధించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.