Mehbooba Mufti: కాశ్మీర్ మరణాలతో లాభ పడుతున్న బీజేపీ: మెహబూబూ ముఫ్తీ

తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

Mehbooba Mufti: కాశ్మీర్ మరణాలతో లాభ పడుతున్న బీజేపీ: మెహబూబూ ముఫ్తీ

Mehbooba Mufti: కాశ్మీర్‌లో జరుగుతున్న మరణాలతో బీజేపీ లబ్ధి పొందుతోందని విమర్శించారు జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ఇటీవలి కాలంలో జమ్మూ-కాశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పుల్లో అనేక మంది పౌరులు మరణిస్తున్న సంగతి తెలిసిందే.

Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ ఘటనలపై జమ్మూ-కాశ్మీర్ పీడీపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ స్పందించారు. ఈ మరణాల ద్వారా బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందుతోందని ఆమె ఆరోపించారు. ‘‘కాశ్మీర్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడల్లా బీజేపీ లబ్ధి పొందుతోంది. ఇక్కడ మైనారిటీలపై, కాశ్మీరీలపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. సాధారణ ప్రజలు మరణించినప్పుడు ఇక్కడ ఎలాంటి జవాబుదారీతనం ఉండటం లేదు.

Bengaluru: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుస్తులు తీసేయమన్నారన్న మహిళ.. అధికారులు ఏం చెప్పారంటే

కాశ్మీర్‌లో సంభవిస్తున్న మరణాలకు ఆర్మీదే బాధ్యత అని ఇక్కడి పౌరులు అంటున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాల గురించి ప్రజలు సమాచారం అందిస్తున్నారు. రాజౌరి ప్రజలు కూడా సమాచారం ఇస్తున్నారు. వీటన్నింటికీ ఆర్మీదే బాధ్యత. వాళ్లు ఈ ఘటనలపై విచారణ జరుపుతాం అంటారు. వాటి నివేదికలు ఏవి?’’ అని మెహబూబా ముఫ్తీ విమర్శించారు. రాజౌరి జిల్లాలో సోమవారం జరిగిన మరో ఘటనలో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. వరుసగా తీవ్రవాద దాడులు జరిగి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు.