BJP-JDU: నీతి ఆయోగ్ మీటింగ్‌కు నితీష్ డుమ్మా.. బీజేపీ-జేడీయూ బంధానికి బీటలు?

బిహార్‌లో బీజేపీ-జేడీయూ బంధానికి బీటలువారుతున్నాయా? సీఎం నితీష్ కుమార్ తాజా వైఖరి చూస్తే నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఆహ్వానించిన ఏ సమావేశానికీ వెళ్లలేదు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశానికీ దూరంగా ఉన్నారు.

BJP-JDU: నీతి ఆయోగ్ మీటింగ్‌కు నితీష్ డుమ్మా.. బీజేపీ-జేడీయూ బంధానికి బీటలు?

7 reasons for Nitish vs BJP

BJP-JDU: బిహార్‌లో బీజేపీ-జేడీ(యూ) బంధానికి బీటలువారుతున్నట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో సీఎం నితీష్ కుమార్ దూరంగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసే సమావేశాలకు కూడా వెళ్లడం లేదు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. దీంతో బీజేపీకి, ఎన్డీయేకు దూరంగా ఉండాలని నితీష్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

Malashri Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సీనియర్ నటి కూతురు

బిహార్‌లో బీజేపీ, ఇతర పక్షాలతో కలిపి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ జేడీ(యూ)తో పోలిస్తే బీజేపీకే ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే కూటమిలో భాగంగా నితీష్ కుమార్ 2020లో సీఎం పదవి చేపట్టారు. అప్పటినుంచి పలు అంశాల్లో బీజేపీతో ఆయనకు విబేధాలున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ వైఖరితో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆలోచనలకు బీజేపీ సహకరించడం లేదు. దీంతో ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెల 17 నుంచి ఇప్పటివరకు నాలుగు సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లలేదు.

Car Hit: యూపీ లీడర్ కారును ఢీకొట్టి అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్

తర్వాత రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి, తర్వాత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికీ వెళ్లలేదు. నితీష్ ఈ వైఖరికి బీజేపీ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలే కారణమని అంచనా. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న విజయ్ కుమార్ సిన్హాను తొలగించాలని నితీష్ కుమార్ అనుకుంటున్నారు. కానీ, దీనికి బీజేపీ అంగీకరించడం లేదు. అలాగే కేంద్రంలో జేడీ(యూ) నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న బీజేపీ ప్రతిపాదనను కూడా నితీష్ వ్యతిరేకిస్తున్నారు.

Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు

ఇలా అనేక అంశాలలో నితీష్.. బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు మంగళవారం పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత నితీష్ వైఖరిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.