Covid Vaccine : షాకింగ్.. బీజేపీ నేతకు 5 డోసుల వ్యాక్సిన్‌.. ఆరో టీకాకు షెడ్యూల్‌

ప్రస్తుతం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వ్యక్తులకు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. అది కూడా రెండు డోసుల మధ్య వ్యవధి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న కొన్ని వారాలకు ర

Covid Vaccine : షాకింగ్.. బీజేపీ నేతకు 5 డోసుల వ్యాక్సిన్‌.. ఆరో టీకాకు షెడ్యూల్‌

Covid Vaccine

Covid Vaccine : ప్రస్తుతం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వ్యక్తులకు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. అది కూడా రెండు డోసుల మధ్య వ్యవధి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న కొన్ని వారాలకు రెండో డోసు ఇస్తారు. రెండు డోసులు తీసుకుంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది కామన్ గా జరిగేది. అయితే ఓ బీజేపీ నేత విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఆ నాయకుడికి ఐదు డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారట. అంతేకాదు తాజాగా ఆరో డోసు కూడా ఇచ్చేందుకు షెడ్యూల్‌ కూడా చేశారట. ఏంటి షాక్ అయ్యారా? మీరే కాదు.. ఆ బీజేపీ నాయకుడు కూడా ఇలానే కంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే..

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ నేతకు ఐదు డోసుల కొవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారని, ఆరవ డోస్ షెడ్యూల్ చేసినట్లు అతని టీకా సర్టిఫికెట్‌లో వెల్లడైంది. టీకా ధ్రువపత్రం చూసుకుని అతడు అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

మీరట్ నగరంలోని సర్ధనా ప్రాంతం బూత్ నంబర్ 79 బీజేపీ అధ్యక్షుడు, హిందూ యువ వాహిని సభ్యుడు రాంపాల్ సింగ్ (73) తన టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాంపాల్ సింగ్‌కు రెండు డోసుల టీకాను మాత్రమే ఇచ్చారు. కానీ అతని టీకా సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకుంటే ఐదు డోసుల టీకా తీసుకున్నట్లు, మరో టీకా కోసం తాజాగా షెడ్యూల్ చేసినట్లు ఉంది. దీంతో రాంపాల్ సింగ్ ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించి ఇదేంటని ప్రశ్నించాడు.

Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు..

వాస్తవానికి రాంపాల్ సింగ్ మొదటి డోస్ టీకాను ఈ ఏడాది మార్చి 16న, రెండవ డోస్ మే 8న తీసుకున్నాడు. కానీ సింగ్ తన అధికారిక సర్టిఫికెట్‌ను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోలేదు. తీరా ఇటీవల డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఇప్పటికే ఐదు డోసుల వ్యాక్సిన్ పొందినట్టు, డిసెంబర్ 2021, జనవరి 2022ల మధ్య ఆరో డోస్ టీకా కోసం షెడ్యూల్ చేసినట్లు సర్టిఫికెట్ లో చూపిస్తుందని రాంపాల్‌ సింగ్‌ వాపోయాడు.

సర్టిఫికెట్ ప్రకారం.. మార్చి 16న మొదటి డోస్, మే 8న రెండో డోస్, మే 15న మూడు, సెప్టెంబర్ 15న నాలుగు ఐదు డోసుల టీకాలు తీసుకున్నట్లు సర్టిఫికెట్‌లో చూపిస్తుంది. దీనిపై అతడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. టీకా పంపిణీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సర్టిఫికేట్‌లో డోసుల వివరాలు తప్పుగా వచ్చాయని ఆరోపించాడు. దీనిపై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అఖిలేశ్‌ మోహన్‌ స్పందించారు. ఎక్కడో పొరపాటు జరిగి ఉండవచ్చని తెలిపారు. లేదా వెబ్‌సైట్‌పై హ్యాకింగ్‌ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు.